రాష్ట్రీయం

వైకుంఠ ఏకాదశినాడు సామాన్యులకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 5: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుమలలో ఈనెల 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాల సందర్భంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ అన్ని ఏర్పాట్లు చేపట్టిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమలలో ఆదివారం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లో షెడ్లు, మాడవీధుల్లోని షెడ్లు, కల్యాణవేదిక ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను, క్యూలైన్లను పరిశీలించామని, వర్షం కురిసినా భక్తులు ఇబ్బందులు పడకుండా చక్కగా ఏర్పాటు చేశారని, అనుబంధంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారని వివరించారు. గతంలో కంటే మెరుగ్గా ఏర్పాట్లు చేశారంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈనెల 6న వైకుంఠ ద్వారం తెరచిన అనంతరం వీఐపీ దర్శనాలను త్వరితగతిన పూర్తిచేసి సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్తామన్నారు. భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేపట్టిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డికి మంత్రి అభినందనలు తెలిపారు. భక్తులు టీటీడీకి సహకరించి సంతృప్తిగా వైకుంఠ ద్వారదర్శనం చేసుకోవాలని కోరారు.
భక్తుల సౌకర్యాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్
తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి, మంగళవారం వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా విశేషంగా విచ్చేసిన భక్తులకు కల్పించిన సౌకర్యాలను
ఆదివారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్ట్‌మెంట్లు, ఆ తరువాత నారాయణగిరిలోని షెడ్లను తనిఖీ చేశారు. టీటీడీ కల్పించిన సౌకర్యాలపై అక్కడ వేచి ఉన్న భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే సుమారు 90 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, స్కౌట్లు, పోలీసులు చక్కగా సేవలందిస్తున్నారని కొనియాడారు. కంపార్ట్‌మెంట్లు, షెడ్లలో వేచి ఉన్న భక్తులు సంయమనం పాటించి టీటీడీ అధికారులకు సహకరించి సంతృప్తికరంగా వైకుంఠ ద్వారదర్శనం చేసుకోవాలని ఆయన కోరారు.

'చిత్రం... తిరుమలలో ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో మాట్లాడుతున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్