రాష్ట్రీయం

భద్రాద్రికి ముక్కోటి శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జనవరి 4: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ముక్కోటి శోభ ను సంతరించుకుంది. రామాలయం విద్యుద్దీపాల వెలుగులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో ఉన్న స్వామిని తిలకించిన భక్తులు పులకరించారు. ఆలయం లో ముందుగా స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు
నిర్వహించి కృష్ణావతారంలో అందంగా అలంకరించారు. అనంతరం భక్తుల భజనలు, కోలాటాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ భారీ ఊరేగింపుగా స్వామిని మిథిలాస్టేడియం వద్ద ఉన్న అధ్యయనోత్సవ వేదిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ భక్తుల దర్శనం అనంతరం తిరువీధి సేవను ఘనంగా జరిపారు. కాగా ఆదివారం నిర్వహించే తెప్పోత్సవానికి గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం తెల్లవారుజామున ఉత్తరద్వారంలో స్వామి మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో 2 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, సబ్‌కలెక్టర్ భవేశ్‌మిశ్రాలు పరిశీలించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తారని భావిస్తున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.