రాష్ట్రీయం

క్యాట్‌లో తెలుగు తేజాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: దేశవ్యాప్తంగా 20 ఐఐఎంలతో పాటు వందలాది మేనేజిమెంట్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించే క్యాట్‌లో ఈసారి 21 మంది 99 ప్లస్ పర్సంటైల్‌ను సాధించారు. అందులో తెలంగాణ నుండి ముగ్గురు విద్యార్థులు టాపర్ల జాబితాలో నిలిచారు. తెలంగాణ నుండి సమీర్ అహ్మద్ 99.88 పర్సంటైల్, సుజిత్ రామగిరి 99.79 పర్సంటైల్, పార్త్ గోస్వామి 99.62 పర్సంటైల్ సాధించారు. అత్యధిక పర్సంటైల్ సాధించిన ఈ ముగ్గురిని ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు అభినందించారు. దేశవ్యాప్తంగా గత ఏడాది నవంబర్ 24న క్యాట్ నిర్వహించారు. 57,004 మంది అమ్మాయిలు, 1,34,917 మంది అబ్బాయిలు ఈ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అయితే వారి లో 2,09,926 మంది హాజరయ్యారు. క్యాట్ ఫలితాలను పర్సంటైల్‌లో ఇస్తారు. దాంతో 99 ప్లస్ పర్సంటైల్ దాటినవారు 21 మంది కాగా అందులో 19 మంది ఇంజనీరింగ్ విద్యార్థులే కావడం గమనార్హం. ఆరుగురు ఐఐటీల నుండి, ఇద్దరు ఎన్‌ఐటీల నుండి ఒకరు జాదవ్‌పూర్ యూనివర్శిటీ నుండి 99 ప్లస్ పర్సంటైల్ సాధించగా, నలుగురు మహారాష్ట్ర వారున్నారు.
''చిత్రాలు.. పార్త్ గోస్వామి (99.62%)
*సమీర్ అహ్మద్ (99.88%)
*సుజిత్ రామగిరి (99.79%)