రాష్ట్రీయం

రామావతారంలో స్వామి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: మూర్త్భీవించిన ధర్మ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు భద్రగిరిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో నిజరూపంలో భక్తులను కనువిందు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో స్వామి గురువారం నిజరూపంలో దర్శనమిచ్చి భక్తులకు అభయమిచ్చారు. ముందుగా ఆలయంలో విశ్వక్సేనపూజ, పుణ్యాహావచనం, స్నపనం నిర్వహించి స్వామిని ఆరాధించారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా దశవతారాల్లో కన్పిస్తున్న స్వామి కోదందరాముడిగా కదిలి రావడంతో ఆ రూపాన్ని కళ్లారా వీక్షించేందుకు భక్తులు పోటీ పడ్డారు. తిరువీధి సేవలో భాగంగా వీధుల్లో ముగ్గులు వేసి కొబ్బరికాయలు కొట్టారు. అడుగడుగునా హారతులతో నీరాజనాలు పలికారు. శుక్రవారం స్వామివారు బాలరామావతారంలో దర్శనమిస్తారని భద్రాచలం దేవస్థానం వైదిక పెద్దలు తెలిపారు.