రాష్ట్రీయం

‘ఇక ఆర్టీసీలో 2020 పోటీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడాలంటే 2020 క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు మధ్య పోటీ ఉన్నట్లే కార్మికులు, అధికారులు మధ్య విధుల్లో పని చేయాల్సి ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపు ఇచ్చారు. గురువారం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో మంత్రి అధికారులతో ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారుల నుద్దేశించి మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడానికి క్రికెటర్ల మధ్య నడిచే మ్యాచ్‌లాగా ఉండాలని, అలాంటప్పుడే ఆర్టీసీ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ తనకు రెండు కళ్లు అంటూ మంత్రి అన్నారు. రెండు కళ్లను ఎంత జాగ్రతగా కాపాడుతామో అలా ఆర్టీసీని పరిరక్షించడానికి పని చేస్తానన్నారు. 2020లో ఆర్టీసీకి లాభాల్లో రావడానకి అవసరమైన చర్యలను ప్రతిపాదించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్త సంవత్సరంలో సంస్థలో సంస్కరణలతో పాటు విధి విధానాలపై నివేదికను అందజేయాలన్నారు. నిజాం కాలం నుంచి ప్రజలకు ఎంతో సేవలు అందించిన రవాణా వ్యవస్థను అభివృద్ధి వైపు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన కోరారు. 2021 నాటికి ఆర్టీసీ ఉద్యోగులు బోనస్ తీసుకోవాలన్నారు. సమ్మె కాలంలో ఆర్టీసీ అధికారులు శ్రమించారన్నారు. సమ్మె ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండడడానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. ఆర్టీసీ, ఆర్టీఏ సమన్వయంతో పని చేసి ప్రజలకు సేవలు అందించడం జరుగుతోందన్నారు. ఆర్టీసీ వెలువరిస్తున్న ప్రస్థానం జనవరి సంచికతో పాటు రవాణాశాఖ డైరీ, ట్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.