రాష్ట్రీయం

ఆర్టీసీ నూతన ఎండీగా ప్రతాప్ బాధ్యతల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: రవాణా రంగంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పోటీతత్వాన్ని దీటుగా ఎదుర్కొంటూ సంస్థ పురోభివృద్ధికి ప్రతి ఉద్యోగి తనవంతు కృషిని నిర్విరామంగా కొనసాగించాలంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కోరారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం సరైనదే అని రుజువు చేసేలా అంకితభావంతో పని చేయాలన్నారు. ఆర్టీసీ భవన్‌కు చేరుకున్న ప్రతాప్‌కు తొలుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన తదుపరి ఆయన ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు బుధవారం నుండి ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారన్నారు. తద్వారా ఉద్యోగ భద్రతకు భరోసా లభించినట్లు అయిందన్నారు. ముఖ్యమంత్రి ఆశయాన్ని సఫలీకృతం చేసేలా సంకల్పదీక్షతో సాగాలన్నారు.