రాష్ట్రీయం

ఎవరు చెప్పినా వినకపోతే జగన్‌కే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 1: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎవరు చెప్పినా వినకుండా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకుపోతే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. క బుధవారం తనను కలిసిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ చిన్న పిల్లాడిలా మొండి వైఖరితో ఉంటే ఆయనకే కాకుండా రాష్ట్రానికి కూడా నష్టం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. గత ఆరునెలల్లో ఆయన తీసుకున్న అత్యధిక నిర్ణయాలు కోర్టు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించినవేనని గుర్తు చేశారు. హైకోర్టు, రాజధానిని మరోచోటుకు మార్చాలంటే అంత సులభమైన విషయాలు కావని అన్నారు. కేవలం తన పంతం కోసం ఇలాంటి అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో అక్రమాలు జరిగినా, చట్టవిరుద్ధంగా క్రయవిక్రయాలు జరిగినా విచారణ జరిపించి బాధ్యులను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు.