రాష్ట్రీయం

కరోనాపై పారాహుషార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తున్న కరోనా( కోవిడ్-19)పై రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ప్రకటించింది. రైల్లో ప్రయాణించే ఏసీ ప్రయాణికులు సొంతంగా దుప్పట్లను తెచ్చుకుంటే మంచిదని అధికారులు సూచించారు. జోన్ పరిధిలో అన్ని జోన్లలో రైల్వే సిబ్బంది ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్ డివిజన్లలోని కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. జోన్‌లో అన్ని రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతను పాటించాలన్నారు. రైల్వే ప్రయాణికులు బోగస్ ప్రచారాన్ని నమ్మోద్దుని సూచించింది. ఏదైనా అనుమానాలు ఉంటే రైల్వే అధికారులతో సంప్రదించాలని హితవు పలికింది. ఈనెల 31 వరకూ రైల్వే సిబ్బంది ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని సూచించింది.