రాష్ట్రీయం

కరోనా ప్రభావం.. 8 ప్రత్యేక రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: కరోనా ప్రభావం రైళ్ళపై పడింది. ఫలితంగా ప్రయాణికులు లేకపోవడంతో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ళను రద్దు చేస్తూ ఆ శాఖ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం-సికింద్రాబాద్(08501), సికింద్రాబాద్-విశాఖపట్నం(08502), విశాఖపట్నం-తిరుపతి(08573), తిరుపతి-విశాఖపట్నం(08574), సంబల్‌పూర్-బాన్స్‌వాడ(08301), బాన్సవాడ-సంబల్‌పూర్(08302), భువనేశ్వర్-సికింద్రాబాద్(08407), సికింద్రాబాద్-్భవనేశ్వర్(08408) ప్రత్యేక రైళ్ళు రద్దయ్యాయి. వీటిని ఈ నెలాఖరి వరకు నిర్దేశించిన ఆయా తేదీల్లో రద్దు చేసినట్టు సంబంధితాధికారి మంగళవారం ప్రకటించారు. నాలుగైదు రోజులుగా రైళ్ళల్లో ప్రవేశించే వారి సంఖ్య గణనీయంగా పడిపోగా, ఇపుడు పలు రైళ్ళల్లో ప్రయాణికులు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు తమ ప్రయాణాలను మానుకుంటున్నారు. విమానాలు, నౌకాయానం ద్వారా వచ్చే వారికి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుండగా రైళ్ళ ప్రయాణికులను పరీక్షించి వైరస్ లక్షణాలను గుర్తించడంలోనే ఇబ్బందులు తప్పడంలేదంటూ రైల్వేవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. వైరస్‌ను పూర్తిస్థాయిలో నివారించడం కోసం ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ రంగంలోకి దిగింది. ప్రత్యేకంగా కోవిడ్-19 పేరిట సెల్‌ను ఏర్పాటు చేసింది. అలాగే జోన్ పరిధిలోకి వచ్చే ఖుర్దా, సంబల్‌పూర్, వాల్తేర్ డివిజన్ల పరిధిల్లో కరోనా వైరస్ లక్షణాలు కలిగి ఉండే ప్రయాణికులను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక నిఘాను పెట్టింది. రైల్వేలో కీలకమైన కమర్షియల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), హెల్త్ డిపార్ట్‌మెంట్‌లు బాధ్యత వహించే విధంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ జనరల్ మేనేజర్ విద్యాభూషణ్ ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి అత్యవసర పరిస్థితులను అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రయాణికులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి ఈ వైరస్ నివారణ కోసం అవసరమైన శక్తిని కలిగి ఉండాలంటూ రైల్వే సిబ్బందికి సూచించారు. జోన్ పరిధిలోకి వచ్చే వాల్తేర్, ఖుర్దా, సంబల్‌పూర్ డివిజన్లలో ముఖ్యమైన రైల్వేస్టేషన్ల అన్నిచోట్ల హెల్ప్‌లైన్లు ఏర్పాటయ్యాయి. కరోనా వైరస్ లక్షణాలు కలిగి ఉండే వారికి తక్షణ చికిత్సను అందించేందుకు వీలుగా 122 పడకల సామర్థ్యం కలిగి ఉండే ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. భువనేశ్వర్, పూరి, ఖర్దారోడ్డు, పలాస రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్క్‌ల ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కమర్షియల్, ఆర్పీఎఫ్, హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
*చిత్రం...భారీ పోస్టర్లతో రైల్వే ప్రచారం