రాష్ట్రీయం

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌కు క్యాట్‌లో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. ఇక ఇదే వ్యవహారంలో కేంద్ర హోం శాఖ సైతం ఏపీ నిర్ణయాన్ని ధృవీకరించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 8వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీళ్లు) నిబంధనలు 3(1) కింద సస్పెండ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఏపీ పోలీసు అదనపు డీజీగా ఉన్న సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్టు తేలడంతో సస్పెండ్ చేసినట్టు ఏపీ ప్రభుత్వం పేర్కొంటూ జీవో 18ను జారీ చేసింది. పోలీసు ఇంటిలిజెన్స్ ప్రోటోకాల్స్‌ను సైతం ఉద్ధేశ్యపూర్వకంగా ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసు శాఖ నిధుల దుర్వినియోగం, ఏరోశాట్, యూఏవీల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.