రాష్ట్రీయం

యాదాద్రిలో వైభవంగా ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం రెండవ రోజు ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం పూజాధి కార్యక్రమాలను పాంఛరాత్ర ఆగమశాస్త్రానుసారం వైభవంగా నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, లోకపాలకుడైన లక్ష్మినరసింహుడి కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించే ఘట్టం ధ్వజారోహణం, గరుడాళ్వార్‌కు మహానివేదన, భేరీ పూజ, హవనం కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, యాజ్ఞికుల బృందం శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ ఆళ్వార్‌ను ఆరాధించి మహానివేదన చేసి గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణంతో సమస్త దేవతలను స్వామివారి కల్యాణాన్ని ఆహ్వానించే బాధ్యతను గరుత్మంతుడికి అప్పగించారు. గరుడాళ్వార్‌కు మహానివేదన చేసిన గరుడ ముద్దల ప్రసాదం స్వీకరిస్తే సంతానప్రాప్తి, సకల శుభాలు కల్గుతాయన్న నమ్మకంతో భక్తులు గరుడ ముద్దల కోసం పోటీపడ్డారు. చతర్ముఖ బ్రహ్మ సారథ్యంలో సాగుతున్న బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సమస్త దేవతలను భేరీ పూజ, అష్టరాగాలాపనలతో దేవతాహ్వానం నిర్వహించి వేద పారాయణలు, హోమాధి పూజలు, మంత్ర పఠనాలతో కొలిచి బాల ఆలయంలో విడిది ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి ధ్వజారోహణ ఉత్సవంలో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు శుక్రవారం నుండి బాల ఆలయంలో లక్ష్మినరసింహులకు విశేషాలంకార, వాహన సేవలు నిర్వహించనున్నారు.
పెండ్లికొడుకుగా లక్ష్మినరసింహుడు ఉదయం మత్స్యావతార అలంకారంలో, రాత్రి శేష వాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

*చిత్రం...బ్రహ్మోత్సవ పూజల్లో శ్రీ లక్ష్మీనరసింహులు