రాష్ట్రీయం

పండ్ల తోటల పాలిట కరోనా ‘రుగోస్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: చైనాను కుదిపేసిన కరోనా వైరస్‌తో నిన్న మొన్నటి వరకు భారతదేశాన్ని సైతం భయపెట్టినా దీని నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో అలాంటిదే మరో వైరస్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పండ్ల తోటలకు సర్వనాశనం చేస్తోంది. కరోనా వైరస్ మొదట కేరళలో గుర్తించినట్టే పండ్ల తోటలకు సోకుతున్న ‘రుగోస్’ వైరస్ కూడా అక్కడి నుంచే వ్యాప్తి చెందినట్టు వ్యవసాయ శాస్తవ్రేత్తలు గుర్తించారు. మొట్టమొదటగా కేరళ రాష్ట్రంలో కనిపించిన రుగోస్ వైరస్ అక్కడి నుంచి తమిళనాడుకు, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, తాజాగా సరిహద్దు ఉన్న తెలంగాణ జిల్లాలకు సోకుతున్నట్టు వ్యవసాయ అధికారులు గుర్తించారు. విజయవాడలో ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యవసాయాధికారులు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అయిల్‌పామ్ రీసెర్చ్ శాస్తవ్రేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో రుగోస్ వైరస్ రోజురోజుకూ తీవ్రతరమై విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఆరు జిల్లాల్లో 10,226 హెక్టార్లలో కొబ్బరి, 11,774 హెక్టార్లలో అయిల్‌పామ్ సాగుపై ప్రభావం చూపినట్టు గుర్తించారు. కొబ్బరి, అయిల్‌పామ్‌లపైనే కాకుండా అరటి, జామ, సీతాఫలం పండ్ల తోటలకు సోకిన రుగోస్ వైరస్ వల్ల తీవ్ర నష్టం వాటిల్లినట్టు వెల్లడించారు. మున్ముందు ఇది ఇతర పండ్ల తోటలకు కూడా సోకే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఖమ్మం జిల్లాలోని అయిల్‌పామ్‌లకు కూడా సోకిన ఈ వైరస్ ఇతర చెట్లు, పైర్లకు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలపై రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఇలాఉండగా రుగోస్ వైరస్ పూర్తి పేరు ఆర్‌ఎస్‌డబ్ల్యూ (రుగోస్ స్పిరాలింగ్ వైట్ ఫ్లై). మొదట ఈ వైరస్ కేరళలో కనిపించిందని, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు
కూడా విస్తరిస్తూ వస్తున్నట్టు వ్యవసాయ శాస్తవ్రేత్తలు గుర్తించారు. తెల్లదోమ వల్ల సోకే రుగోస్ వైరస్‌ను మొట్టమొదట తూర్పు గోదావరి జిల్లాలోని కడియం గ్రామంలో కొబ్బరి చెట్లపై గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత దీనిని అయిల్‌పామ్ చెట్లకు సోకడాన్ని గమనించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం మండలాల్లో 1,500 హెక్టార్లలో అయిల్‌పామ్ సాగుపై రుగోస్ ప్రభావం చూపినట్టు గుర్తించారు. రుగోస్ వైరస్‌కు కారకమైన తెల్లదోమ మొదట మొక్కలోని రసాన్ని పీల్చి వేస్తుంది. దీనివల్ల ఆకులు ఎండిపోయి రాలడం, కొమ్మలు రాలడం ప్రారంభం అవుతుంది. చెట్లపై వాలిన వైరస్ కారక తెల్లదోమ మలమూత్రాల వల్ల శుభ్రత లోపించి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది. దీనివల్ల పైర్లు, చెట్లు వ్యాధిగ్రస్తం కావడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయినట్టు శాస్తవ్రేత్తల అధ్యయనంలో తేలింది. ప్రమాదకర రుగోస్ వైరస్ విస్తరించకుండా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ అనేక చర్యలు చేపట్టింది. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణలోనూ రుగోస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యానవన అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ అభిప్రాయపడ్డారు. రుగోస్ వైరస్ అత్యంత హానికరమైన, వేగంగా వ్యాప్తి చెందే కీటకమని ఆయన వివరించారు. ఇది సోకిన మొక్కలు, చెట్లు పూర్తిగా నాశనం అవుతాయని ఆయన చెప్పారు. మొక్కల్లో రసం పీల్చడం వల్ల పైర్ల ఎదుగుదల ఆగిపోయి దిగుబడి పూర్తిగా తగ్గడంతో పాటు నాణ్యత లోపిస్తుందని వివరించారు. ఈ వైరస్‌ను నివారించడానికి రైతులను అప్రమత్తం చేయడంతోపాటు సపోర్టు ఇసారియా ఫంగస్‌ను ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ఎల్లో స్టికీ స్ట్రాప్స్, స్ప్రేయర్లపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు తెలిపారు. గ్రామానికి ఐదుగురు రైతులను గుర్తించి, వారికి రుగోస్ వైరస్‌పై అవగాహన, నివారణ చర్యలపై శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉన్న ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తున్న రుగోస్ భవిష్యత్‌లో తెలంగాణలోని ఇతర జిల్లాలకు సోకకముందే అప్రమత్తమై చర్యలు చేపట్టాలని రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతోంది.

*చిత్రాలు..రుగోస్ వైరస్ కారకమైన తెల్లదోమ
*వైరస్ సోకడంతో తెల్లగా మారిన కొబ్బరి ఆకులు