రాష్ట్రీయం

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: ఆర్టీసీ సిబ్బంది తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులమంటూ సంబరపడుతుంటే వారెవరూ ఊహించని రీతిలో అకస్మాత్తుగా వారిని ఉక్కిరిబిక్కిరి చేసేలా శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రవర్తన నియమావళి తు.చ తప్పక శనివారం నుంచే అమల్లోకి వస్తుందంటూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఇక కార్మిక సంఘాలు మీడియా ముం దు మాట్లాడరాదు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా సమ్మెలు, ప్రదర్శనలు చేయరాదు. ఇక నుంచి ట్రేడ్ యూనియన్ చట్టం 1926, పారిశ్రామిక వివాదాల చట్టం 1947 వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే
కొందరు నేటికీ తమ ఫిర్యాదులను మీడియా ముందు బహిర్గతం చేస్తూ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారంటూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇక నుంచైనా తమకు వర్తించే నిబంధనలను గమనించి తదనుగుణంగా తమ చర్యలను సరి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సంఘాల మాదిరిగా తమ ఫిర్యాదులు, పిటిషన్‌లు, గ్రీవెన్స్‌లు సంబంధిత అధికారులకు నివేదించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే కార్మిక సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వంలో విలీనమైనా తమ పని విధానమేమి మారదని కార్మిక చట్టాల పరిధిలోనే ఉంటామని చెబుతున్నారు.