రాష్ట్రీయం

త్వరలో జాతీయ జల విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: త్వరలో జాతీయ జల విధానంపై చట్టం రూపొందించి అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలు జల విధానంపై అభిప్రాయాలు తెలియచేయాలని కేంద్రం కోరింది. జలాలు రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశమైనందు వల్ల అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రాలు నీరు తమ పరిధిలోని అంశమైనందు వల్ల నీటి సరఫరా, పంపిణీ, నిల్వపై సంపూర్ణ్ధాకారాలు కలిగి ఉన్నాయి. అదే నదీ జలాలకు సంబంధించిన అంశమైతే, ఆయా రాష్ట్రాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటున్నాయి. పైగా కృష్ణా, గోదావరి, కావేరీ నదుల బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సంక్లిష్టంగా మారితే తప్ప కేంద్రం జోక్యం చేసుకోదు. ప్రపంచంలో ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో జాతీయ జల విధానాలు అమలులో ఉన్నాయి. దీనివల్ల జాతీయ స్థాయిలో నీటి నిల్వ, సంరక్షణకు వీలవుతుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, అంశాలను కేంద్రం ఎంట్రీ 56 కింద జోక్యం చేసుకునే అధికారం కలిగి ఉంటుంది. ప్రస్తుతం నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటుపై బిల్లును లోక్‌సభ ఆమోదించినా, రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. ఈ ట్రిబ్యునల్ అమలులోకి వస్తే నిర్ణీత కాలపరిమితి లోపల జల వివాదాలు పరిష్కరించే అధికారాలను ట్రిబ్యునల్ కలిగి ఉంటుంది. వివాదాల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేసే అధికారం ట్రిబ్యునల్ కలిగి ఉంటుంది. 18 నెలల లోపల వివాదాలను పరిష్కరించని పక్షంలో ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలతో సమానం. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ లోపల కొత్త జాతీయ జల
విధానాన్ని తేవాలని కేంద్రం యోచిస్తోంది. కాని సమాఖ్య తరహా విధానం వల్ల అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం సేకరించడంపై దృష్టిని సారించింది.
జల సంరక్షణకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య వ్యవస్థలను భాగస్వాములను చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే పది మంది జల నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ జాతీయ జల చట్టంపై ముసాయిదా బిల్లును రూపొందిస్తున్నారు. గతంలో 1987, 2002, 2012లో జాతీయ జల విధానాలను కేంద్రం రూపొందించినా అవి అమలుకు నోచుకోలేదు. ఇవన్నీ ముసాయిదా బిల్లుల రూపంలో ఉన్నాయి. కేంద్ర జలశక్తి వనరుల మంత్రిత్వ శాఖ, నేషనల్ వాటర్ ఫ్రేమ్ వర్క్ బిల్లు, రివర్ బేసిన్ మేనేజిమెంట్ బిల్లు, భూగర్భ జల నియంత్రణ నమూనా బిల్లు ఉన్నాయి. కొత్త జల విధానం తెస్తే ఇందులోనే గంగానదితో పాటు 13 ఇతర నదుల ప్రక్షాళనకు నిర్దేశించిన మాస్టర్ ప్లాన్‌లను కలుపుతారు. ప్రస్తుతం జల జీవన్ మిషన్ కింద 2024 నాటికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరు, అటల్ భుజల్ యోజన ద్వారా భూగర్భ జల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో 1592 బ్లాకుల్లో 256 జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నెలకొని ఉంది. తలసరి నీటి వినిమయం కూడా క్రమేపీ పడిపోతోంది. 1947లో 6047 క్యూబిక్ మీటర్ల వినియోగం ఉంటే, 2001లో 1816కు, 2011లో 1486 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. 2021లో 1486, 2031లో 1367, 2041లో 1282, 2051లో 1228 క్యూబిక్ మీటర్లకు తలసరి నీటి వినిమయం తగ్గుతోందని జల నిపుణులు అంచనా వేస్తున్నారు.