రాష్ట్రీయం

సమర్థవంతంగా నీటి యాజమాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటి యాజమాన్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) కు చెందిన వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగం నుండి వచ్చిన 14 మంది ప్రతినిధులతో తమిళిసై బుధవారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయని, అనేక చిన్న చిన్న నదులు, వాగులు, వంకలు ఉన్నాయన్నారు. ప్రధాన మంత్రి ప్రకటించిన ‘ఈచ్ డ్రాప్-మోర్ క్రాప్’ నినాదం తెలంగాణలో సమర్థతగా అమలవుతోందని పేర్కొన్నారు. గోదావరి జలాలను వినియోగించుకునేందుకు కాళేశ్వరం తదితర ప్రాజెక్టులను నిర్మించారని, కృష్ణా జలాల వినియోగానికి కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను చేపట్టారని గుర్తు చేశారు. వర్షపు నీటిని వృథా కాకుండా చూసేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారన్నారు. అటవీ ప్రాంతాల్లో కూడా వన్యప్రాణులకోసం, భూగర్భ జలాల పెంపుదల కోసం నీటికుంటలను ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేశారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఇళ్లల్లో కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. మొత్తం మీద నీటి యాజమాన్యం సజావుగా సాగుతోందని, కోటి ఎకరాలకు సాగు నీటిని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్ వివరించారు. వేస్ట్ మేనేజ్ మెంట్‌లో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారని గవర్నర్ వివరించారు. అమెరికాబృందం తెలంగాణ సందర్శించడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. గవర్నర్‌తో సమావేశం కావడం పట్ల అమెరికా బృందం ఆనందం వ్యక్తం చేసింది.

*చిత్రం...రాజ్‌భవన్‌లో బుధవారం అమెరికా బృందంతో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్