రాష్ట్రీయం

మే 28 నుంచి పీజీఈసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ , ఎం ఆర్క్ తదితర పీజీ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి మే 28వ తేదీ నుండి 31వ తేదీ వరకూ పీజీఈసెట్ నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి , కన్వీనర్ ప్రొఫెసర్ ఎం కుమార్‌లు తెలిపారు. పీజీఈసెట్ ఫలితాలను జూన్ 15న విడుదల చేస్తామని ఆయన చెప్పారు. బుధవారం నాడు పీజీఈసెట్ షెడ్యూలును ఆయన విడుదల చేశారు. నోటిఫికేషన్‌ను మార్చి 4వ తేదీన విడుదల చేస్తామని, ఆన్‌లైన్ దరఖాస్తులను మార్చి 12 నుండి స్వీకరిస్తామని అన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 30 చివరితేదీ అని చెప్పారు. 500 ఆలస్యపు రుసుంతో మే 6వ తేదీ వరకూ, 2వేలు అదనపు రుసుంతో మే 13 వరకూ, 5వేల అదనపు రుసుంతో మే 20 వరకూ 10వేల అదనపు రుసుంతో మే 26 వరకూ దరఖాస్తులను అనుమతిస్తారు. మే 20 నుండి 27వ తేదీ వరకూ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మే 28 నుండి 31 వ తేదీ వరకూ వివిధ సబ్జెక్టులకు జరుగుతుంది. ఫలితాలను జూన్ 15న ప్రకటిస్తారు. మే 28 ఉదయం ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్ సబ్జెక్టులపైనా, సాయంత్రం 2 నుండి 4 గంటల వరకూ ఆర్కిటెక్చర్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జీలపైనా 29వ తేదీ ఉదయం జియో ఇంజనీరింగ్, జి ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ, సాయంత్రం కంప్యూటర్ సైన్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 30వ తేదీ ఉదయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, సాయంత్రం సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, 31వ తేదీ ఉదయం ఎన్విరాన్‌మెంటల్ మేనేజిమెంట్, సాయంత్రం నానో టెక్నాలజీ అంశాలపై ఆన్‌లైన్ పరీక్ష హైదరాబాద్ , వరంగల్ రీజనల్ కేంద్రాల్లో జరుగుతుంది.
కాగా, ఇక్ఫాయి యూనివర్శిటీ ఆధీనంలోని ఇక్ఫాయి బిజినెస్ స్కూల్(ఐబీఎస్)కు అంతర్జాతీయ అక్రిడిటేషన్ దక్కిందని అధికారులు తెలిపారు. అసోసియేషన్ టు అడ్వాన్స్ కాలేజీయేట్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్ ఇంటర్నేషనల్ -ఏఏసీఎస్‌బీ అక్రిడిటేషన్ దక్కిందని డైరెక్టర్ వెంకట శేషయ్య సాకల్య తెలిపారు.