రాష్ట్రీయం

వేములవాడలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ/వేములవాడటౌన్, ఫిబ్రవరి 19: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న మూడురోజుల జాతరకు దేవాదాయ శాఖ, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు కోటి 30 లక్షల రూపాయలను దేవాదాయ శాఖ కేటాయించింది. రాష్ట్రంలో అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడలో జరిగే జాతరకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచే వచ్చే భక్తులే కాకుండా పొరుగురాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, ఒడిసా, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లును ముమ్మరంగా చేపట్టింది. జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ అధ్యక్షతన జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, గ్రామీణ నీటి సరఫరా, నగర పంచాయతీ, ట్రాన్స్‌కో, ఆర్టీసీ, రెవెన్యూ, సెస్, పంచాయతీరాజ్, అర్‌డబ్యూఎస్ అధికారులు జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి లక్షా 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విడిది సౌకర్యాలను ఇప్పటికే కల్పించారు. ఘుమఘుమలాడే లడ్డూ ప్రసాదాలను 3 లక్షల వరకు తయారుచేయాలని అధికారులు నిర్ణయించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు లడ్డూలను తయారుచేస్తూ గోదాంలో నిల్వ ఉంచుతున్నారు. పుష్కరిణి ప్రక్షాళన పూర్తయింది. ధర్మగుండాన్ని స్వచ్ఛమైన నీటితో నింపుతున్నారు. ఆలయాల్లో లైటింగ్ వ్యవస్థ మరమ్మతులను అధికారులు చేపడుతున్నారు. ఆలయం ముందుభాగంలో స్వాగత తోరణానికి విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించడానికి ఏర్పాట్లు దాదాపు పూర్తిఅయ్యాయి.
ఆలయంలోని దేవతామూర్తులకు సంబంధించిన వెండి ప్రభలను శుభ్రం చేస్తున్నారు. పార్వతీపురం, నందీశ్వర, పార్కింగ్ స్థలం, భీమేశ్వర ఆలయం సమీపంలో, జాతర గ్రౌండ్‌లో భక్తుల విడిది కోసం ఇప్పటికే చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు.

*చిత్రం...విద్యుత్ దీపాలంకరణలో వెలుగొందుతున్న రాజన్న ఆలయం