రాష్ట్రీయం

సూర్యప్రభ వాహనంపై లయకారకుడి విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 18: సమస్త భూత గణాలకు ఆధిపత్యం వహిస్తున్న ముక్కంటీశ్వరుడు సూర్యప్రభ, చప్పర వాహనాలపై భక్తకోటికి దర్శనమిచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు జరిగే ఉత్సవాలను భూతరాత్రి అంటారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లతో పాటు శ్రీ వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి చండికేశ్వరుడితో కలిసి చతుర్మాడ వీధులలో అంగరంగ వైభవంగా ఊరేగారు. అంతకుమునుపు ఉత్సవర్లను అర్చకులు అలంకార మండపంలో విశేష అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి సమీపంలోని హోమ మండపం వద్ద వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ శాస్తబ్రద్దంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హోమ కార్యక్రమాలు, హారతులు సమర్పణ చేశారు.
అలంకార మండపం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను సూర్యప్రభ, చప్పరం వాహనాలపై వేంచేపుచేసి పురమాడవీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు హరహర మహదేవ శంభోశంకర అంటూ నామస్మరణ చేస్తూ కర్పూర నీరాజనాలుపట్టి భక్తిశ్రద్ధలతో స్వామి, అమ్మవార్లను ప్రార్థించారు. కాగా వాహనసేవ ముందు కోలాటాలు, నృత్యప్రదర్శనలతో భజన బృందాలు భక్త్భివంతో తన్మయత్వం చెంది చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపుమధుసూధన రెడ్డి, ఈఓ చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు.
భూత వాహనంపై పశుపతి,
చిలక వాహనంపై జ్ఞానాంబిక
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి భూతనాథుడైన పరమశివుడు భూతవాహనంపైన, అమ్మవారు చిలక వాహనంపైన నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భూతనాథుడైన పరమశివుడు భూతాలపై తనకుగల దయాగుణాన్ని చాటడానికి ఈ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి. మంగళవారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లను స్వర్ణ వజ్ర కచిత ఆభరణాలతో, వివిధ రకాల పుష్పాలతో అర్చకులు అత్యంత సుందరంగా అలంకరించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య హారతులు ఇచ్చిన అనంతరం స్వామివారు భూతవాహనంపైన, అమ్మవారు చిలకవాహనంపై అధిరోహించి నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి,అమ్మవార్ల వాహనసేవలకు కర్పూర నీరాజనాలు పట్టి చేసిన నామస్మరణలతో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, భక్తులు, అధికారులు పాల్గొన్నారు.