రాష్ట్రీయం

ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసాన్ని సవరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: ఆర్టీసీ ఉద్యోగులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను సవరించాలని 11వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చైర్మన్ అశుతోష్ మిశ్రాను ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ నేతలు, ఏపీ జేఏసీ అమరావతి నేతలు కోరారు. అశుతోష్ మిశ్రాను గురువారం ఆయన కార్యాలయంలో కలిసిన యూనియన్ నాయకులు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నందున వేతనాల్లో వ్యత్యాసాలను కూడా సవరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుండి ఇంకా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణ గురించి ఇంకా ఎటువంటి జీఓ రాలేదని, ప్రభుత్వం నుండి పే రివిజన్ కమిషన్‌కు ఆదేశాలు వచ్చిన వెంటనే గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ నాయకత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకుంటామని పే రివిజన్ కమిషనర్ అశుతోష్ మిత్రా హామీ ఇచ్చారు. పే రివిజన్ కమిషన్‌కు ప్రతిపాదనలు ఇచ్చినప్పుడు పీటీడీ (ప్రజా రవాణా విభాగం) ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు కేటగిరీల వారీగా ఉన్న తేడాలను సరిపోల్చుతూ ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేలా చూస్తామని, ఈ విషయంపై ఆర్టీసీలో ఉన్న జేఏసీ సంఘాలతో కూడా చర్చించి ప్రభుత్వం నుండి ఆదేశాలు విడుదల అయిన వెంటనే ప్రతిపాదనలు అందజేస్తామని ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.