రాష్ట్రీయం

నేటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు : మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి రామారావు తెలిపారు. ఈనెల 14న ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఈనెల 15 నుంచి 22 వరకు ఉదయం పూజలతో పాటు స్వామివారికి, అమ్మవారికి సాయంత్రం వాహన సేవలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17న టీటీడీ వారి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, 18న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 21న మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుధ్రాభిషేకం అనంతరం పాగాలంకరణ ఉంటుందని తెలిపారు. 22న సాయంత్రం రథోత్సవం, రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుందన్నారు. 23న రాత్రి 7.30 గంటలకు ధ్వజారోహణ, 24న రాత్రికి పుష్పోత్సవంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
శ్రీశైలం క్షేత్రంలో ఈనెల 14నుంచి 24 వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కర్నూల్ కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు బాధ్యతలను అప్పగించారని ఈవో రామారావు తెలిపారు. కలెక్టర్ సూచనల మేరకు ఉచిత దర్శనం, రూ.150 శీఘ్ర దర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లులకు ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేసి, నీడ వసతి కల్పించినట్టు తెలిపారు. ఇరుముడులను సమర్పించే శివస్వాములకు చంద్రవతి కళ్యాణమండపము వద్ద ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి నుంచి శివాజీ గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఈనెల 18నుంచి 22వరకు స్పర్శ దర్శనాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు వైద్య సౌకర్యం కోసం 30 పడకల తాత్కలిక వైద్యశాలను ఏర్పాటు చేశామని, టూరిస్టు బస్టాండ్ వద్ద మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, పాతాళగంగలో ఉన్న స్నానాల ఘాట్‌లలో మహిళలకు బట్టలు మార్చుకునే గదులు, షవర్ స్నానాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారన్నారు.