రాష్ట్రీయం

భారత్‌లో హింసకు తావు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో హింసకు తావు లేదని, హింసను ప్రేరేపించే ఏ విషయానికీ యువత మద్దతు ఇవ్వరాదని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మతోన్మాదాన్ని ప్రోత్సహించే వారు సెక్యులరిజం అనే పదాన్ని అడ్డుపెట్టుకుని ఇతరులపై దాడి చేస్తుంటారని, అలాంటి ప్రయత్నాలను ఖండించాలని అన్నారు. తప్పుడు పనులు చేస్తున్న వారిని సమర్ధించడం జాతి వ్యతిరేక చర్య అవుతుందని అన్నారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే శాంతియుత వాతావరణం నెలకోల్పడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు.
సరైన నడవడిక, కష్టపడే మనస్తత్వం, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని ఇందుకు అబ్దుల్ కలాం ఒక మంచి ఉదాహరణ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చేసే ప్రతిపనిలో సామాజిక స్పృహ, సానుకూల దృక్పథం, జాతీయ భావాన్ని మనసులో నింపుకుని పనిచేయాలని యువత, విద్యార్థులకు ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని శాంతిసరోవర్ ఆడిటోరియంలో మంగళవారం నాడు జరిగిన కలాం కనె్వన్షన్ -2020 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ కలలు కనండి, వాటిని సాకారం చేయడానికి కృషి చేయండి అని అబ్దుల్ కలాం ఇచ్చిన పిలుపులోని భావాన్ని మనం అర్ధం చేసుకోవాలని అన్నారు. కలలకు నూతన భాష్యం చెబుతూ కలల ఆలోచనలు వాస్తవ రూపం దాలుస్తాయని ఇందుకు కష్టించి పనిచేయాలని కలాం ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని మరువొద్దని అన్నారు. తమ భవిష్యత్ గురించి ఆలోచించే వాళ్లు గొప్పవాళ్లు అయితే దేశ భవిష్యత్ గురించి ఆలోచించే వారు మహానీయులుగా ఎదుగుతారని అన్నారు. భారతదేశ భవిష్యత్ గురించి కలలు కని, సాకారం చేసే దిశగా కృషి చేసిన మహర్షి అబ్దుల్ కలాం అని చెప్పారు. చిన్నతనం నుండే చిన్నారులకు దేశభక్తిని, సామాజిక స్పృహను, కష్టపడి పనిచేసే మనసత్వాన్ని , క్రమశిక్షణను అలవరచాలని అన్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి, పేదరికాన్ని జయించిన అబ్దుల్ కలాం దేశం గర్వించదగ్గ శాస్తవ్రేత్తగా ఎదిగారని చెప్పారు. కలాం ఎదుగుదల ఒక్కరోజులో జరిగింది కాదని, కఠోర శ్రమ, క్రమశిక్షణ ఉన్నాయని, ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోయినా, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అహోరాత్రులు శ్రమించి ప్రపంచం గర్వించే శాస్తవ్రేత్తగా ఎదిగారని అన్నారు. కుల, మత , లింగ వివక్షను, సామాజిక అసమానతలను పారద్రోలడంలో యువత, విద్యార్థులు చొరవ తీసుకోవాలని అన్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ మన పెద్దలు అందించిన విలువలను పాటిస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఇష్టపడి కష్టపడితే నష్టపోయేది ఏమీ లేదని అర్ధం చేసుకోవాలని అన్నారు. కలాం పుస్తకాలను చదువుతూ తాను ఉద్వేగానికి గురయ్యానని ఆయన సూక్తులను చదవడంతో పాటు ఆచరణలో పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలొ డీఆర్‌డీఓ చైర్మన్ సతీష్‌రెడ్డి ,కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వ్యవస్థాపకుడు నరేష్, ట్రస్టీ పిడికిటి భూపాల్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డితో పాటు వివిధ రంగాల ప్రముఖులు, వివిధ పాఠశాలలకు చెందిన 2400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

*చిత్రం... హైదరాబాద్ శాంతిసరోవర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కలాం కనె్వన్షన్ -2020లో ప్రసంగిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు