రాష్ట్రీయం

ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జనవరి 28: ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త శకం ప్రారంభమైంది. మంగళవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా పంచాయతీలో కన్హా ఆశ్రమాన్ని హార్ట్ఫుల్‌నెస్ సంస్థ గ్లోబల్ హెచ్ క్వార్టర్‌గా ప్రకటించడమే కాకుండా ధ్యాన మందిరాన్ని యోగా గురూజీ బాబా రాందేవ్, శ్రీరామచంద్ర మిషన్ గురూజీ కమలేష్ డీ పటేల్ ప్రారంభించి ప్రప్రథమ మార్గదర్శి లాలాజీకి అంకితం చేశారు. శ్రీరామచంద్ర మిషన్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. కన్హా పంచాయతీలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి లక్ష మంది కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా మందిరాన్ని ఏర్పాటు చేశారు. ధ్యాన మందిరం ప్రారంభోత్సవంతో విదేశీయుల రాకతో కన్హా శాంతివనం సందడిగా మారిపోయింది.
ప్రారంభోత్సవానికి వచ్చిన 40 వేల మంది అభ్యాసలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. హార్ట్ఫుల్‌నెస్ సంస్థ 1,400 ఎకరాల్లో విస్తరించి ఉంది. 40 వేల మందికి పైగా అతిధ్యం ఇవ్వగల సుస్థిర పర్యావరణ వ్యవస్థ. రోజుకు లక్ష మందికి ఆహారాన్ని అందించగల వంటగది అందుబాటులోకి రానుంది. 350 పడకల ఆయుష్ వైద్యశాల, ఆరు లక్షల మొక్కలతో నర్సరీ, నాలుగేళ్ల క్రితం నాటిన అనేక లక్షల చెట్లు వంటివి అందరి మనస్సులను ఆకర్షించడానికి హార్ట్ఫుల్‌నెస్ లెర్నింగ్ సెంటర్‌లో మరెన్నో ఉన్నాయి.
1945లోనే శ్రీరామచంద్ర మిషన్ ప్రస్థానం
భారతదేశంలో 1945వ సంవత్సరంలోనే శ్రీరామచంద్ర మిషన్‌ను స్థాపించారు. ప్రపంచ వ్యాప్తం గా అనేక లక్షల మంది అభ్యాసకులతో, హార్ట్ఫుల్‌నెస్ ధ్యానం నేటి వేగవంతమైన ప్రపంచంలో అంతర్గత ప్రశాంతత, నిశ్చలతను కనుగొనడంలో సహాయపడింది. శ్రీరామచంద్ర మిషన్ నేతృత్వంలో యోగా, ధ్యానం నిర్విరామంగా కొనసాగుతున్నాయి.
భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాల్లో ధ్యాన మందిరాలు ఉన్నాయని, వాటిలో ధ్యానం, యోగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అభ్యాసకులు ఉన్నారని శ్రీరామచంద్ర మిషన్ గురూజీ కమలేష్ డీ పటేల్ పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన ధ్యాన మందిరంలో 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొదటి వరకు 75 ఏళ్ల మైలురాయి జ్ఞాపకార్థం సామూహిక, ఆధ్యాత్మిక, ధ్యాన కార్యక్రమాలు కొనసాగుతాయి.
ఫిబ్రవరి 2న రాష్టప్రతి రాక
అత్యంత సుందరంగా నిర్మించిన ధ్యాన మందిరానికి ఫిబ్రవరి 2న భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నట్లు శ్రీరామచంద్ర మిషన్ గురూజీ కమలేష్ డీ పటేల్ తెలిపారు. సామాజికవేత్త అన్నా హజారేతోపాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
*చిత్రాలు.. * ప్రారంభోత్సవానికి హాజరైన 130 దేశాల అభ్యాసకులు
గురూజీ కమలేష్ డీ పటేల్‌తో కలిసి బాబా రాందేవ్ ధ్యానం చేస్తున్న దృశ్యం (ఇన్‌సెట్‌లో )