రాష్ట్రీయం

సీఏఏ, ఎన్నార్సీపై అపోహలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఎన్నార్సీ భారతదేశంలోని ప్రతి పౌరుడికి వర్తిస్తుందని, కేవలం ముస్లింల కోసమే మాత్రమే పెట్టింది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సీఏఏ, ఎన్నార్సీ వల్ల పౌరసత్వం తీసివేస్తారనే భయాలు ఎవరికి అవసరం లేదని, కొందరు మత ప్రాతిపదికన ప్రజలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం సోదరుల్లో ఉన్న భయాలు, అపోహలను తొలగించేందుకు ఓ సమావేశాన్ని నిర్వహించి న్యాయ నిపుణులతో వారి సందేహాలను నివృతి చేస్తానన్నారు. భారత రాజ్యాంగం గొప్పదని, మత ప్రాతిపదికన ప్రజలను, మతం పేరిట మనుషులను విడదీయటం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు తమ విధానాలకు అనుగుణంగా వివరాలు సేకరిస్తారని తెలిపారు. సీఏఏ తీసుకొచ్చింది బంగ్లాదేశ్ సరిహద్దు దేశాలనుండి వచ్చే హిందువులు, ముస్లింల కోసమని, ఇది కేవలం ఒక్క ముస్లింల కోసమే అన్నది అవాస్తవమన్నారు. అస్సాంలో వలసల కారణంగా అక్కడివారి ఉద్యోగాలు పొతున్నాయన్నారు. పార్లమెంటులో సీఏఏకు అనుకూలంగా వైసీపీ ఓటు వేసి రాష్ట్రంలో మాత్రం తాము వ్యతిరేకమంటూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. బీజేపీతో పొత్తు వలన సమస్యలు వస్తే అవి పార్టీ పరిధిలో చర్చించుకుంటామని, పొత్తు పెట్టుకున్నంత మాత్రాన తాను మతోన్మాదిని కాదన్నారు. రాజకీయం అంటే సేవ చేయడమేనని, ఓట్ల కోసం తిట్టుకోవటం కాదన్నారు. సమస్యలపై పోరాటం చేసేటప్పుడు కొందరు దూషిస్తుంటారని, మనకి సహనం ఉండాలేగానీ లొంగిపోయే స్థాయిలో ఉండటం మంచిదికాదన్నారు. పార్టీకి సమయం కేటాయించేవారే బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
*చిత్రం... మాట్లాడుతున్న జన సేనాని పవన్‌కల్యాణ్