రాష్ట్రీయం

రూ.500 కోట్లతో పిరమాల్ ఫార్మా ఫెసిలిటీ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ పిరమాల్ గ్రూప్ రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న పిరమాల్ ఫార్మా ఫెసిలిటీని రూ.500 కోట్ల వ్యయంతో విస్తరించనున్న ట్టు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడానికి
దావోస్ వెళ్లిన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో బుధవారం అక్కడ పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ సమావేశమయ్యారు. అనంతరం తమ గ్రూప్‌ను తెలంగాణలో విస్తరించనున్నట్టు అజయ్ పిరమాల్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో తమకున్న ఫార్మా యూనిట్‌లో నూతన తయారీ బ్లాకులు, వేర్‌హౌస్ విస్తరణకు వచ్చే ఐదేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఆయన వివరించారు. ఈ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్‌కి ధన్యవాదాలు తెలిపారు. పిరమాల్ సంస్థకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందించనున్నట్టు కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో తమ యూనిట్‌ను విస్తరించడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని తమ ప్లాంట్లను కూడా హైదరాబాద్‌కు తరలించే అంశాన్ని పరిశీలించనున్నట్టు అజయ్ పిరమాల్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకున్న అనుకూల విధానాలను పరిగణనలోకి తీసుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న ఇతర కంపెనీలను కూడా కొనుగోలు చేసి తన తయారీ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీలో భాగంగా, హెల్త్‌కేర్, సురక్షణ మంచినీరు, డిజిటల్ విలేజ్ వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం తమకున్న కంపెనీకి అన్ని అనుమతులు కలిగిన మూడు బ్లాకులు ఉన్నాయని, జీరో డిస్చార్జ్ విధానంలో, పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా తమ గ్రూప్ పనిచేస్తుందన్నారు. హెల్త్‌కేర్ రంగంలో ఇప్పటికే 1,400 మందికి ఉద్యోగాలు లభించగా సంస్థను మరింత విస్తరించడం వల్ల మరో 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు. అదనంగా పెట్టనున్న రూ.500 కోట్ల పెట్టుబడి ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మందుల తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. కొత్త ప్లాంట్ స్థాపించడానికి స్థలాన్ని ఎంపిక చేసేందుకు వచ్చే నెలలో తమ గ్రూప్ ప్రతినిధి బృందం పర్యటిస్తుందని ఆయన చెప్పారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ పెవిలియన్
దావోస్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సును పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసిన పెవిలియన్ ఆకర్షణగా నిలిచినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణతో పాటు కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా పెవిలియన్లను ఏర్పాటు చేశాయి. అయితే తెలంగాణ పెవిలియన్‌లో ఒక రిసెప్షన్, రెండు సమావేశ మందిరాలు, వెయిటింగ్ లాంజ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. వర్చువల్ రియాలిటీ లాంజ్‌ను సందర్శించే వారికి తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, వార్షిక నివేదికల సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. దీనితోపాటు హైదరాబాద్ నగర చరిత్ర, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలపై చిత్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ వెంట దావోస్ వెళ్లిన వారిలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం, టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ తదితర అధికారులు ఉన్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గూగుల్ కార్యకలాపాలతో పాటు, దాని భవిష్యత్ విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. కాగా, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్ కార్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల విస్తరణను కేటీఆర్ వివరించారు. ఇంకా రాక్ వెల్ అటోమేషన్ సీఈవో బ్లేక్ డీ మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు రాజీవ్ వెంకయ్య, మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కే గోయాంకా, కేపీఎం జీ గ్లోబల్ చైర్మన్ బిల్ థామస్ తదితరులు ఉన్నారు.

'చిత్రం... దావోస్ పర్యటనలో భాగంగా పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్, గూగుల్ సీఈఓ
సుందర్ పిచాయ్‌తో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్