రాష్ట్రీయం

ఎట్టకేలకు మండలిలో బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అధికార, ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య శాసన మండలిలో ఎట్టకేలకు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టగలిగింది. బిల్లులను ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడం.. వ్యూహ, ప్రతి వ్యూహాలతో వాడివేడిగా మండలి సమావేశం సాగింది. మండలిలో భారీగా మంత్రులు మోహరించారు. శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టేందుకు మంత్రి బుగ్గన ప్రయత్నించడాన్ని రూల్ 71 కింద నోటీసు ద్వారా టీడీపీ అడ్డుకుంది. ఈ నోటీసుపై చర్చకు అనుమతించడం ద్వారా అసెంబ్లీలో ఆమోదముద్ర పొందిన బిల్లులు చర్చకు వచ్చే అవకాశంపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ నోటీసు ఇవ్వడంతో అధికార పక్షం అప్రమత్తమై బిల్లులను ఎలాగైనా ప్రవేశపెట్టేందుకు తన శక్తియుక్తులన్నిటినీ ఒడ్డింది. ఉదయం 10.20 గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల వరకూ తాము ఇచ్చిన నోటీసుపై ముందుగా చర్చ జరపాలని టీడీపీ పట్టుబట్టి, సభ జరగకుండా నిరోధించడంలో సఫలమైంది. అయితే సాయంత్రం నుంచి నోటీసుపై చర్చకు తాము సిద్ధమని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే నోటీసుపై చర్చ జరిపే ముందు టేబుల్ చేసిన బిల్లులను ముందుగా మండలిలో పరిగణలోకి తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో సాయంత్రం నుంచి బిల్లులను పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ముందుగా నోటీసుపై చర్చ జరపాలని, ఆ తరువాత బిల్లుల సంగతి చూద్దామని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపదారు. దీంతో మంత్రి బుగ్గన జోక్యం చేసుకుని, భవిష్యత్తులో ప్రభుత్వ బిజినెస్‌లో జాప్యం జరుగకుండా ముందుగా బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రూల్ 71 కింద ఇచ్చిన నోటీసుపై చర్చకు అనుమతిస్తూ ఇచ్చిన రూలింగ్ న్యాయమైనది కాదని, అయినా అంగీకరిస్తున్నామని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బిల్లులను పరిగణలోకి తీసుకోమనడం దారుణమని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంతో సమానంగా పాలక పక్షాన్ని చూడాలని కోరాల్సి రావడం దురదృష్టకరమన్నారు. టీడీపీ చెప్పిందే చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇలా అయితే రూల్ బుక్ ఎందుకు అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, మాధవ్ కూడా బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ న్యాయం కాదంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యుడు దీపక్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వివాదం చేసుకున్నారు. ఇది ఆఖరి సమావేశమంటూ అధికార పక్షం నుంచి వ్యాఖ్య రావడంతో చైర్మన్‌ను బెదిరిస్తున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఒక దశలో టీడీపీ సభ్యులు, వైకాపా సభ్యులు పోడియంలోకి దూసుకువచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. నోటీసుపై చర్చ జరపాలని టీడీపీ, బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని వైకాపా సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేశారు. నినాదాలతో మండలి హోరెత్తింది. 19 మంత్రులు కూడా వైకాపా సభ్యులకు మద్దతుగా లేచినిలబడ్డారు. సభ అర్డర్ లేదంటొ సమావేశాన్ని కొద్ది సేపు వాయిదా వేశారు. సాయంత్రం 6.14 గంటలకు తిరిగి సమావేశమైంది. నోటీసు, 2 బిల్లులను కలిపి చర్చిద్దామని తెలిపారు. సభలో జరిగిన దానిపై చింతిస్తున్నానని, మనస్థాపానికి గురవుతున్నానని చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. రూల్ 71 కింద ముందుగా చర్చిస్తామని, అంతకు ముందు బిల్లులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. దీంతో వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన, సీఆర్‌డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. తమ నోటీసుపై ముందుగా చర్చకు అనుమతించకుండా, బిల్లులను పరిగణలోకి తీసుకోవడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు దూసుకు వచ్చి, నినాదాలు చేయడం ప్రారంభించారు. అనంతరం నోటీసుపై చర్చకు సిద్ధమని
మంత్రులు తెలిపారు. అయినా టీడీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. చర్చించేందుకు సిద్ధమన్నా నినాదాలు చేయడాన్ని మంత్రలు తప్పుపట్టారు. చర్చకు ముందుకు రాని సభ్యుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. చర్చకు సిద్ధమన్నా ముందుకు రావడం లేదని మంత్రి బుగ్గన ఆరోపించారు. బిల్లులను ఆమోదించాలని లేదా నోటీసుపై చర్చించాలని కోరారు. అయినప్పటికీ నోటీసుపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు. బిల్లులను పరిగణలోకి తీసుకున్నంత మాత్రాన ఆమోదించినట్లు కాదని యనమల తెలిపారు. తాము సవరణలు ఇస్తామని తెలిపారు. చాలా సేపు టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఒక దశలో నోటీసుపై చర్చకు టీడీపీ సభ్యులు ముందుకు రావడంతో సభలో గందరగోళానికి తెరపడింది.