రాష్ట్రీయం

ఫిబ్రవరి 1న తిరుమలలో సూర్యజయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రథసప్తమి రోజున వాహన సేవల వివరాలు
సూర్యప్రభ వాహనం : ఉదయం 5.30 నుండి 8గంటల వరకు
చిన్నశేషవాహనం : ఉదయం 9 నుండి 10గంటల వరకు
గరుడవాహనం : ఉదయం 11 నుండి 12గంటల వరకు
హనుమంత వాహనం : మధ్యాహ్నం ఒంటి గంట నుండి 2గంటల వరకు
చక్రస్నానం : మధ్యాహ్నం 2 నుండి 3గంటల వరకు
కల్పవృక్షవాహనం : సాయంత్రం 4 నుండి 5గంటల వరకు
సర్వభూపాల వాహనం : సాయంత్రం 6 నుండి 7గంటల వరకు
చంద్రప్రభ వాహనం : రాత్రి 8 నుండి 9గంటల వరకు నిర్వహిస్తారు
*
తిరుపతి, జనవరి 21: సూర్యజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 1వ తేదీన తిరుమలలో నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని తిరుమల అదనపు ఈవో ఏ.వి.్ధర్మారెడ్డి టీటీడీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు తిరుమల అన్నమయ్య భవన్‌లో రథసప్తమి ఏర్పాట్లపై ధర్మారెడ్డి టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతియేటా మాఘ శుద్ధ సప్తమి నాడు తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. క్రీ.శ.1564 నుండి తిరుమలలో ఈ పర్వదినాన్ని నిర్వహిస్తున్నట్లు శాసనాధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ రథసప్తమి పర్వదినాన శ్రీమలయప్ప స్వామివారు ఒకే రోజు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారన్నారు. దీనే్న ఒక్కరోజు బ్రహ్మోత్సవాలని, ఉప బ్రహ్మోత్సవాలని పిలుస్తారని వివరించారు. సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగుస్తాయని తెలిపారు. వాహనసేవలను తిలకించేందుకు ఉదయం 4 నుండి రాత్రి 9గంటల వరకు గ్యాలరీల్లో భక్తులు వేచి ఉంటారని, ఎండకు ఇబ్బంది పడకుండా జర్మన్‌షెడ్లు ఏర్పాటు చేశామని, టీ, కాఫీ, అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు నిరంతరాయంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని అదనపు ఈవో తెలిపారు. మెరుగైన పారిశుద్ద్య చర్యలు చేపడతామన్నారు. వాహనసేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించామన్నారు. భక్తులకు సేవలించేందుకు 3500మంది శ్రీవారి సేవకులు, 300మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఈ పర్వదినం కారణంగా శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేశామని, సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు సి వి ఎస్ ఓ శివకుమార్‌రెడ్డి, ఎస్ ఇ2 నాగేశ్వర్‌రావు, ఎస్టేట్ అధికారి విజయసారథి, ట్రాన్స్‌ఫోర్ట్ జి ఎం శేషారెడ్డి, ముఖ్యవైద్యాధికారి డాక్టర్ నాగేశ్వర్‌రావు, ఆరోగ్యవిభాగం అధికారి డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు నాగరాజ, బాలాజీ, దామోదరం, తదితరులు పాల్గొన్నారు.