రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో గత ఏడాది డిసెంబర్ 26వ తేదీ నుంచి 25 రోజులపాటు చేపట్టిన అధ్యయనోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈసందర్భంగా ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపుచేసి దివ్యప్రబంధ గోష్ఠిని వివరించారు. శ్రీవారి ఆలయంలో వైష్ణవ జియ్యంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాళ్లను గత 25 రోజులుగా గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదించారు. ఈక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4000 పాశురాలను పారాయణం చేశారు. చివరిరోజైన ఆదివారం ‘తన్నీర ముదు’ నిర్వహించారు. అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటిరోజైన సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని దక్షిణ మాడవీధిలోని తిరుమలనంబి ఆలయానికి వేంచేపు చేస్తారు. కాగా తన్నీరుముదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం తిరుమలనంబి ఆలయం నుంచి ప్రదక్షిణగా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని తీసుకువచ్చి ఆలయ అర్చకులకు అందించారు. ఈసందర్భంగా జీయర్‌స్వాములు, ఆచార పురుషులు, ప్రబంధ పండితులు, వేదమంత్రోచ్ఛరణల నడుమ పవిత్రజలాలతో ఆలయంలోకి వేంచేపుచేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి మూలవిరాట్ పాదాలపై అమర్చి ఉన్న బంగారు తొడుగును పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు. ఈసందర్భంగా తిరుమల నంబి రచియించిన ‘తిరుమోడి’ పాశురాలను పారాయణం చేశారు. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసుడు శ్రీ వేంకటేశ్వరస్వామి సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాది ఈ ‘తన్నీరు ముదు’ కార్యక్రమాన్ని నిర్వహించడం టీటీడీ ఆనవాయితీగా పాటిస్తోంది.
'చిత్రం... అధ్యయనోత్సవాల ముగింపు నేపథ్యంలో జీయర్‌ల ఆధ్వర్యంలో పాశురాలను పఠిస్తున్న అర్చకులు