రాష్ట్రీయం

జాతి అస్థిత్వానికి మూలం చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిగూడెం: ఏజాతికైనా అస్థిత్వం ఉండాలంటే ఆ జాతి చరిత్రను ఆచరించినప్పుడే దేశం, సమాజం సుభిక్షంగా ఉంటుందని హంపీ పీఠాధిపతి శ్రీవిరూపాక్ష విద్యారణ్య భారతీస్వామి ప్రవచించారు. శనివారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని రాజానాయిని వెంకటరంగారావు కోటలో దక్కన్ ఆర్కియాలజీ అండ్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పురావస్తు పరిశోధన గ్రంథాలయంతో పాటు తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ మహసభలను శనివారంనాడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో పాశ్చాత్య సంస్కృతిపై మోజుపడిన ప్రజలు మాతృభాషను విస్మరిస్తున్నారన్నారు. సమస్త ప్రాణులకు సృష్టిలో మంచి చేయడంతోనే దేశం వికాసం చెందుతుందన్నారు. సమస్త దేవతలకు పూజలు చేస్తూ మంచి చేస్తున్నామని చెబుతున్న ప్రజలు నేడు వాటిని విస్మరిస్తున్నారన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సన్నగిల్లుతున్న తరుణంలో వాటిని కాపాడి భద్రపరిచి భావితరాలకు అందించేందుకు తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ పూనుకోవాలన్నారు. నేటి సమాజంలో పరభాష వ్యామోహం పట్ల ప్రజలు తీవ్రమైన అనారోగ్యాలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో నష్టపోతున్నారన్నారు. అలాంటి వ్యామోహలను తగ్గించుకోవాలని కోరారు. దేశం ముగ్గురు మాతలు భారతమాత, గోమాత, గాయత్రిమాతలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ అష్టలక్ష్మి స్థిరంగా ఉంటుందన్నారు. గోమాతను పూజిస్తే కోటి దేవతలను పూజించినట్లేనన్నారు. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గోవులు అంతరించిపోతున్నాయని ఆయా రాష్ట్రాల్లో గోవులను పెంచేందుకు కృషిచేయాలన్నారు. ప్రపంచంలోనే బ్రెజిల్ దేశంలో 90 శాతం గోశాలలు ఉన్నాయన్నారు. ప్రపంచంలో అతిపెద్ద గోశాల సౌదీ అరేబియాలో ఉందన్నారు. చరిత్రను చదవండి.. శక్తిని పొందండి అదే భారతదేశానికి శ్రీరామరక్ష అని అన్నారు. నేడు విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయికి వెళ్లాయన్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ హిస్టరీ మహసభలను ప్రారంభించి మునగాల పరగణ చరిత్రపై సంస్థ డైరెక్టర్ కొర్రా జితేన్‌బాబు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత, కార్యక్రమ నిర్వాహకుడు జితేన్‌బాబు మాట్లాడుతూ మరుగున పడిన తెలంగాణ చరిత్రను, సంస్కృతిని బయటకు తీసి నిజనిజాలను నిర్ధేశించాలనే ఉద్దేశ్యంతో దక్కన్ ఆర్కియాలజీ కల్చరల్ సంస్థను నెలకొల్పామన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దా ప్రసాద్, నడిగూడెం రాజావారసులు నాయిని సంతోష్‌రెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ ప్రొఫెసర్ జి.వెంకట్‌రాజన్, చలసాని శ్రీనివాస్, సదానందంలు ఈ సందర్భంగా తెలంగాణ చరిత్రపై ప్రసంగించారు. పలువురు పరిశోధకులు ముద్రించిన 50 గ్రంథాలను సభలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అయూబ్ అలీ, ఎం.వీరేందర్, ఎస్.సరస్వతి, హిమబిందు, జే.కిషన్ పాల్గొన్నారు.
'చిత్రం... హిస్టరీ కాంగ్రెస్ మహాసభల్లో ప్రసంగిస్తున్న హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీస్వామి