రాష్ట్రీయం

రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య 71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, జనవరి 16: రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 పెద్దపులులు ఉన్నాయని ఎన్విరాన్‌మెంటల్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరజ్‌కుమార్‌ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో46 పులులు ఉన్నాయన్నారు. కర్నూలు జిల్లా మహానంది దేవస్థానం దర్శనార్థం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యం చాల బాగుందన్నారు. ఇక్కడే 24 పులులు ఉన్నాయన్నారు. నల్లమల అడవి చాలా దట్టంగా ఉందన్నారు. ఏకోటూరిజంను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అడవుల సంరక్షణకై రాబొయే 5 సంవత్సరాలకు అవసరమయ్యే యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి డీఎఫ్‌ఓలకు సూచనలు ఇచ్చామన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.