ఆంధ్రప్రదేశ్‌

ఏప్రిల్ నుంచే కొత్త జోన్ కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 16: విశాఖపట్నం కేంద్రంగా ఏడాది కిందట ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు మరో రెండు మాసాల్లో ఆరంభం కానున్నాయి. దీనికి ఏప్రిల్ తొలి వారంలో ముహూర్తం పెట్టారు. జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయం, ముఖ్యమైన ఉన్నతాధికారుల క్వార్టర్ల నిర్మాణం తొలి దశలో చేపడతారు. అయితే ముందుగా తగిన స్థలాన్ని గుర్తించాల్సి ఉంది. నగరంలోని ముడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో 40 ఎకరాలకు పైగా ఉన్న రైల్వే స్థలంలోనూ, విశాఖ రైల్వే స్టేషన్ సమీపానున్న వైర్‌లెస్ కాలనీ వద్ద జీఎం కార్యాలయ నిర్మాణానికి అనువుగా ఉంటుందనే అంచనాకు ఉన్నతాధికారులు వచ్చారు. అయితే దీనికి సంబంధించి తుది నివేదికను రైల్వే బోర్డుకు పంపి ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పటివరకు అనేకసార్లు పంపిన నివేదికల్లో స్పష్టత లేకపోవడంతో ఈసారి జీఎం కార్యాలయ నిర్మాణం, ఉన్నతాధికారుల క్వార్టర్లు, ఆయా ఓఎస్‌డీలకు అవసరమైన వసతులు, తొలి దశలో వెచ్చించాల్సిన అంచనా బడ్జెట్ తదితర వాటిపై త్వరలో తుది నివేదిక తయారుకానుంది. తదుపరి వచ్చేనెల ఫిబ్రవరి రైల్వే బడ్జెట్‌లో దీనికి సంబంధించిన ప్రత్యేకంగా నిధులు కేటాయింపు, కొత్త రైళ్ళు, కొత్త రైల్వేలైన్లు తదితర కీలక అంశాలపై కచ్చితమైన నిర్ణయం వెలువడనుంది. ఈలోపు ఓఎస్‌డీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారుల బృందం జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించనున్నారు. జోన్ కార్యాలయానికి ప్రాథమికంగా కల్పించాల్సిన వౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ.200 కోట్ల మేర నిధుల అవసరాన్ని ఇప్పటికే రైల్వేబోర్డుకు తెలియజేయగా, దీని పరిధిలో ఆయా విభాగాలు, ఉన్నతాధికారుల క్వార్టర్లు నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం కావాల్సి ఉంది. విశాఖ రైల్వే స్టేషన్, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి అందుబాటులోకి ఉండే విధంగా కొత్త జోన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే దీని గుర్తింపులో కాస్తంత జాప్యం జరుగుతున్నట్టు రైల్వేవర్గాలు చెబుతున్నాయి. అందువల్లే 2018 డిసెంబర్‌లో బీజేపీ ప్రభుత్వం కొత్త రైల్వేజోన్‌ను ప్రకటించినా, అనువైన స్థలం
కోసం ఇప్పటికీ జల్లెడ పట్టాల్సి వస్తోందని పేర్కొన్నాయి.
వాల్తేర్ మాటేమిటి?
152 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగి ఉండే భారతీయరైల్వేకు ఆర్థిక వెనె్నముకగా నిలిచే వాల్తేర్ డివిజన్ గురించి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఇంకా స్పష్టం కావడంలేదు. విశాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్‌తో కూడిన జోన్‌ను నిర్వహించాల్సిందిగా అనేక ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చేనెల రైల్వే బడ్జెట్ సందర్భంగా అధికారిక ప్రకటన రావచ్చని రైల్వేవర్గాలు భావిస్తున్నాయి. దీనిపై ఇటు రైల్వేబోర్డు, మరోపక్క రాజకీయ నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించకపోవడాన్ని రైల్వేవర్గాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. పది వేల మందికిపైగా ఉద్యోగులు దక్షిణ మధ్య రైల్వేజోన్‌కు వెళ్ళిపోయే పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు ఒడిశా పెత్తనంతో నలిగిపోయిన వాల్తేర్ డివిజన్‌పై ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేజోన్ వివక్ష చూపుతోందంటూ ఇక్కడి వర్గాలు చెబుతున్నాయి. కాగా కొత్త జోన్‌కు నిధుల కేటాయింపు, స్థల పరిశీలన, వాల్తేర్ డివిజన్ ఉద్యోగుల తరలింపు వంటి ముఖ్యమైన అంశాలపై ఇపుడు ఉన్నతాధికారులు దృష్టి పెడుతున్నారు.