రాష్ట్రీయం

రెచ్చిపోయిన పందెంకోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 14: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ ముసుగులో ఏటా నిర్వహించే కోడి పందేలు ఈ ఏడాది సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు. తొలి అరగంట సేపు ఈ డింకీ పందాలే నిర్వహించారు. భోగి పండుగనాడు మధ్యాహ్నం నుంచి జోష్‌లో కోడి పందాలు పెద్దఎత్తున గోదావరి జిల్లాల్లో ఆరంభమయ్యా యి. తొలి బరి పందెమే రూ.లక్ష నుంచి ప్రారంభమయ్యాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇదే తొలి పెద్ద పందెంగా చెప్పవచ్చు. ఆ తర్వాత అక్కడ నుంచి పందాల జోరందుకుంది. తొలుత బరుల్లో అంతా కోడి పందేలనే ప్రారంభించగా సాయంత్రం 4 గంటల సమయం నుంచి గుండాటలు ప్రారంభమయ్యాయి. దీంతో బరులు కిటకిటలాడాయి. అటు కోడి
పందాలు, గుండాటలు ప్రారంభించారని తెలియడంతో పందాల రాయు ళ్లు బరుల వైపే పరుగులు తీశారు. ఆ తరువాత పేకాటలు ప్రారంభించారు. సాయంత్రం 6 గంట ల నుంచి ఈ పేకాటలు, కోతాటలు ప్రారంభించడంతో ఇక బరులు మరింత కిక్కిరిశాయి. తొలి పందాలు ఆలస్యం మయ్యాయి.
గోదావరి జిల్లాల్లో ప్రారంభమైన కోడి పందాలు దాదాపుగా అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల కనుసన్నల్లోనే జరిగాయని చెప్పవచ్చు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు ఎవరూ బరుల జోలికి పోలేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ కోడి పందాలను ప్రారంభించారు. అయితే పందాలు ఆరంభం కాగానే చాలా చోట్ల వివాదాలు ప్రారంభమయ్యాయి. కొంత ఘర్షణకు కూడా దారి తీసింది. ఈ పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. అదే విధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో చోటుచేసుకుంది కానీ పెద్ద మనుషుల నడుమ తిరిగి బరులు ప్రారంభించారు.
తొలిరోజు భోగి పండుగ కావడంతో పందాలు ఆలస్యంగా ప్రారంభమైన చాలా చోట్ల కోడి పందాలు ఫ్లడ్‌లైట్ల కాంతుల నడుమ ప్రారంభించారు. ఇదిలా ఉండగా పెద్ద పందాలు రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని చెప్పవచ్చు. ఈ పందాలు తెల్లవారుజామున 3 గంటల వరకు జరుగుతాయి. ఇక సంక్రాంతి పండుగనాడు అదే స్థాయిలో పందాలు కొనసాగుతాయి. ఈ పందాలన్నీ రూ.లక్షల్లో ఉంటాయని అంచనా. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ నేపధ్యంలో కోడి పందాలతోపాటు ఇతర జూద క్రీడలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నారు.
గుండాట, పేకాట, కోతాటలు ఎక్కువగా జరుగుతాయి. కోడి పందాల పేరుతో ఈ జూద క్రీడలు కోట్లాది రూపాయలకు చేరుకుంటుంది. ఒక్క కోడి పందాల బరిలో ఈ జూదాలు ఆడేందుకు వేలంలో ఒక వ్యక్తి రూ.25 లక్షలకు పాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని బట్టి ఆ జూదాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. తొలి రోజులు ఆలస్యంగా గుండాటలు, అక్కడక్కడ పేకాడలు ప్రారంభమయ్యాయి. నేడు సంక్రాంతి పండుగ నేపధ్యంలో మరింత జోష్‌లో జూదాలు, కోడి పందాలు జరుగనున్నట్లు సమాచారం.

'చిత్రం...లాంఛనంగా ప్రారంభమైన కోడి పందేలు