రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో నయా నియంతృత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: సీఏఏను వ్యతిరేకిస్తున్న పార్టీలను బీజేపీ బ్లాక్‌మెయిల్ చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. సోమవారం నాడు పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలూ నయా నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. కోరలు తీసిన నాగుపాము ఎంఐఎం అని ఎద్దేవా చేశారు. ఎంఐఎంను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, ఏపీ సీఎం జగన్‌ను తెలంగాణ సీఎం ప్రోత్సహిస్తున్నారని, ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలకు ఇంత గోప్యత ఎందుకని ప్రశ్నించారు. గోదావరి ఇతర నదీ జలాల పంపిణీకి సంబంధించి చర్చలు జరపాలంటే నైపుణ్యం ఉన్న ఇంజనీర్లు, ఇరు రాష్ట్రాల సీఎంలు ఉండాలి కదా అలా ఎవరూ లేకుండా ఇరువురు సీఎంలు మాట్లాడుకుంటే ఏం జరుగుతందని ప్రశ్నించారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతరులను ఎలా అణచివేయాలో తెలుసుకునేందుకు పెట్టుకున్న మీటింగ్ అని అన్నారు. ఆంథ్రాలో మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల్లో జగన్ అలజడి సృష్టిస్తున్నారని , ఏపీలో మిలటరీ పాలన సాగుతోందని విమర్శించారు. నాడు ప్రతిపక్ష నేతగా అమరావతిని అంగీకరించిన జగన్ ఇపుడు మాట మారిస్తే ఎలా అని ప్రశ్నించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగాలని సీపీఐ జాతీయ కమిటీ తీర్మానించిట్టు ఆయన వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో రాజధాని ఉంటే ఇబ్బంది లేదని అన్నారు. భారతదేశంలో పార్లమెంటరీ పంథాకు రాజ్యాంగ వ్యవస్థ భూమికకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వమే బరితెగించి వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోందని అన్నారు. సెక్యులరిజం అని పెట్టుకుని, మత వివక్షతో కూడిన సీఏఏను ఆమోదించారని ఆరోపించారు. కేరళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకమని తీర్మానం చేస్తే, ఇది కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానమని గవర్నర్ బెదిరిస్తున్నారని , కేంద్రం చేసింది తప్పుకాదని, రాష్ట్రం చేసింది తప్పు అని చెప్పే నేతలు పాలిస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నయా నియంతృత్వం నడుస్తోందని అన్నారు. విదేశాల నుండి ప్రతినిధులను తీసుకువచ్చి జమ్మూకాశ్మీర్‌లో పర్యటన చేయించారని, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను, జాతీయ పార్టీలను జమ్మూకాశ్మీర్‌కు అనుమతించడం లేదని, ముగ్గురు సీఎంలను గృహనిర్బంధం చేసి, విదేశీయులకు మాత్రం పర్యటనకు అవకాశం ఎలా ఇస్తారని నిలదీశారు. దేశంలో ఉన్న ప్రజలను మాత్రం జమ్మూ పోకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
'చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ