ఫిలిం క్విజ్

టాలెంట్ వుండగానే.. సరళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరత్కాలం
======
బాలరాజు చిత్రంలో అంజలీదేవి నటించిన వ్యాంప్ పాత్రకు నవోదయం శుభోదయం అంటూ పాటను పాడిన నేపథ్య గాయని పేరు మీకు గుర్తుందా? అలాగే కీలుగుర్రం చిత్రంలో ఘంటసాలతో పాడిన యుగళగీతం ‘కాదుసుమా కలకాదుసుమా’ పాట గుర్తుందా? ఈ పాట ఆ గాయనితోపాటు ఘంటసాలకు కూడా పేరు తెచ్చిపెట్టింది. ఆ గొప్ప గాయని ఎవరో కాదు -వక్కలంక సరళ. ఈ గాయని లైలామజ్ను, మరదలు పెళ్ళి, మగవారి మాయలు మొదలగు చిత్రాలలో సూపర్‌హిట్ పాటలు పాడింది. కాలం మారుతున్నకొద్దీ కొత్తతరంతో పరిశ్రమలో జరిగిన కొన్ని రాజకీయాలతో ఈ గాయని సినిమాలను తగ్గించి ఆలిండియా రేడియో మద్రాసు వారికే పాటలు పాడుతూ నెంబర్ 1గా గుర్తింపు పొందింది. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకొని సరళ తమ ఇద్దరు కుమార్తెలను కళారంగానికి పరిచయం చేసినా సంగీత రంగానికి దూరంగా ఉంచి పెద్దమ్మాయి స్వప్నసుందరిని నాట్య రంగానికి పరిచయం చేసింది. స్వప్నసుందరి నర్తకిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తల్లికంటే ఎక్కువ పేరుగాంచింది. రెండో అమ్మాయి వక్కలంక పద్మ నటిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన గోరింటాకు చిత్రంలో శోభన్‌బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. కళారంగంలో టాలెంట్ వున్న వాళ్ళకి ఏ రాజకీయాలు అడ్డురావు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717