Others

లీలామృతం -- శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడు కొండలవాడ వెంకటారమణా/ తెల్లవారవటె తెలియద నాస్వామి/ సడి సేయకోగాలి సడిసేయబోకే/ ఏడనున్నాడో ఎక్కడ్నుడో.. -రాసుకుంటూ పోతే ఆ గొంతునుంచి పలికిన వందలాది అమృత గుళికలు. సూపర్‌హిట్ పాటలు పాడిన పి.లీల మాతృభాష తెలుగు కాదు. తెలుగు నేర్చుకొని పాడి శ్రోతలను ఆనందపర్చిన ఆమె మాతృభాష మలయాళం. తెలుగు, తమిళ, మళయాళ శ్రోతలను తన గాత్ర మాధుర్యంతో అలరించిన లీల మొదటి తెలుగు పాట -ఎన్టీఆర్ మొదటి చిత్రం ‘మన దేశం’ (1948)లోది కావటం విశేషం. బాలాత్రిపురసుందరి అని సాగే ఆ పాటను ఘంటసాల స్వరపర్చారు.
హైదరాబాద్‌లో రెండుసార్లు లీలకు ఘన సన్మానాలు జరిగాయి. డాక్టర్ ఐ భవాని ఆధ్వర్యంలో ఘంటసాల పేరిట అవార్డును అందించి అక్కినేని సత్కరించారు. తర్వాత సంజయ్‌కిషోర్ -సంగమ్ అకాడమీ పేరిట మరోసారి ఘన సన్మానం జరిపించారు. ఇంతమంది శ్రోతలను మధుర గానంతో ఆనందపర్చిన లీల దాంపత్య జీవితంలో ఆనందం కరవైంది. ఆ వేదనను కళ్ళారా చూసిన గాయని జమునారాణి వివాహం చేసుకోకుండా అవివాహితగా ఉండిపోయింది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717