రాష్ట్రీయం

ఇసుక మాఫియా భరతం పట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలి
హైకోర్టు రిటైర్డ్ జడ్డి అధ్యక్షతన కమిటీ
ఉన్నతాధికారులకు చోటు కల్పించండి
తెలుగు ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, డిసెంబర్ 10: రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ఇసుక అక్రమ తవ్వకాల నిరోధానికి శాశ్వత ప్రాతిపదికన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని కోరుతూ సుంకర గంగరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఇసుక మాఫియాను అరికట్టాలని కోరుతూ అనేక పిటిషన్లు దాఖలవుతున్నాయని, హైకోర్టు రిటైర్డు జడ్జి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి ఇసుక మాఫియాను, అక్రమ తవ్వకాలను నిరోధించాలని ఆదేశించింది. ఈ కమిటీలో గనులు, రెవెన్యూ, పర్యావరణం, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు స్వచ్చందసేవా సంఘాల ప్రతినిధులను నియమించాలని ఆదేశించింది. ప్రతిపాదత కమిటీపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలు తెలియచేయాలని ఆదేశించింది. నిర్ణీత కాలపరిమితిలో ఇసుక మాఫియాను అరికట్టాలని కోరింది. మైనింగ్ లీజ్‌లను రద్దు చేసే అధికారం ఈ కమిటీకి ఇవ్వాలని సూచించింది. ఇటీవల కాలంలో అనేక పిటిషన్లు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవాలని కోరుతూ దాఖలయ్యాయని పేర్కొంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు వచ్చిన ప్రదేశాలను జాయింట్ కలెక్టర్ సందర్శించి ఫోటోలతో నివేదిక ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఏపి ఏజి వాదనలు వినిపిస్తూ జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉన్నారని, ఫోటోలు తెచ్చారని, వాటిని బెంచ్‌కు అందచేశారు. పిటిషనర్ జతపరిచిన ఫోటోల్లోని అంశాలు వాస్తవమా కాదా అని కోర్టు అడిగింది. దీనికి తమకు పది రోజులు గడువు కావాలని ఏజి కోర్టును కోరారు. అనంతరరం కోర్టు ఈ కేసు విచారణను పది రోజులపాటు వాయిదా వేసింది.