సంపాదకీయం

విశ్రమించని ‘తోడేలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు దాపురించి ఉన్న చైనా బెడద గురించి పదే పదే చర్చలు విశేషణలు జరుగుతుండడం అంతర్జాతీయంగా ప్రచారం అవుతున్న వ్యవహారం. మన దేశంలోకంటె ఇతర దేశాలలో ఈ చర్చకు ప్రాధాన్యం ఎక్కువగా ఉండడం మన దేశంలో ప్రచారం కాని వ్యవహారం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా సైనిక వ్యూహ విస్తరణ గురించి ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతోంది. తూర్పు ఆసియా ప్రాంతంలోను ఈశాన్య ఆసియా ప్రాంతంలోను చైనా వ్యూహాత్మక దురాక్రమణ దశాబ్దులుగా జరుగుతోంది. రెండు దశాబ్దులుగా హిందూ మహాసముద్ర ప్రాంతం కూడ చైనా ప్రత్యక్ష, వ్యూహాత్మక సైనిక కలాపాలకు గురిఅయి ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతం- ఇండియన్ ఓషన్ రీజియన్- ఐఓఐ-లో ‘‘చైనా- నౌకాదళ కలాపాలను మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి...’’అని మన నౌకాదళం ప్రధాన అధికారి ‘అడ్మిరల్’ కర్మవీరసింగ్ గురువారం వ్యాఖ్యానించడానికి ఈ చైనా వ్యూహాత్మక దురాక్రమణ నేపథ్యం హిందూ మహాసముద్రం చైనా సరిహద్దులలో లేదు. ప్రశాంత మహాసాగరం- పసిఫిక్ ఓషన్- కూడ చైనా తీరాన్ని స్పృశించడం లేదు... హిందూ మహాసముద్రానికి, ప్రశాంత మహాసాగరానికీ మధ్య ఉత్తర పూర్వ ఆసియా ప్రాంతంలో అనేక సముద్రాలు, అఖాతాలు, సింధుశాఖలు, జలసంధులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రాంతంలో వియత్నామ్ మొదలు జపాన్ వరకు అనేక దేశాలు ఏర్పడి ఉన్నాయి. ఈ జలాలు, భూభాగాలు చైనాకు తూర్పున నెలకొని ఉన్నాయి. వియత్నామ్‌కు తూర్పుగాను చైనాకు దక్షిణంగాను, ‘దక్షిణ చైనా సముద్రం’ విస్తరించి ఉంది. చైనాకు ఆగ్నేయంగాను ‘్ఫలిప్పీన్స్’ దేశానికి ఈశాన్యంగాను ‘్ఫలిప్పీన్ సముద్రం’ నెలకొని ఉంది. చైనాకు తూర్పున, జపాన్‌కు దక్షిణాన ‘తూర్పు చైనా సముద్రం’ వ్యాపించి ఉంది. ఈ సముద్రానికి ఉత్తరంగా ‘పసుపు సముద్రం’- ఎల్లో సీ- చైనా జపాన్‌లకు మధ్యన, కొరియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఏర్పడి ఉంది. చైనా ఈశాన్య భాగంలో నెలకొని ఉన్న కొరియా దేశాలకూ, రష్యా దేశానికీ తూర్పుగాను, జపాన్‌కు పశ్చిమంగాను ‘జాపనీయ’ సముద్రం అలరారుతోంది. ఈ సముద్రాలను, దేశాలను దాటి అనేక వేల కిలోమీటర్లు దక్షిణంగా పయనించినప్పుడు మాత్రమే చైనా హిందూ మహాసముద్రాన్ని చేరగలదు, తూర్పుగా దాదాపు వేయి కిలోమీటర్లకు పైగా జపాన్ వంటి దేశాలను దాటి పయనించినప్పుడే చైనా నౌకలు ‘పసిఫిక్’ జలాలను చేరగలవు. ఇదంతా భౌగోళిక స్థితి... అందువల్ల చైనా తన సరిహద్దుల రక్షణకోసం యుద్ధనౌకలను ఈ రెండు సముద్రాలలోకి ‘తోలుకొని’ పోవలసిన పని లేదు, హిందూ మహాసముద్రం కాని ప్రశాంత మహాసాగరం కాని చైనా సరిహద్దులకు సమీపంలో లేవు. కానీ చైనా దశాబ్దుల తరబడి హిందూ మహాసాగర జలాలను తన యుద్ధ నౌకలకు ఆలవాలంగా మార్చడానికి యత్నించింది. ఫలితంగా మన దేశపు దక్షిణపు సరిహద్దులకు సమీపంలో చైనా యుద్ధనౌకల ‘ఉనికి’ పెరిగింది. అడ్మిరల్ కర్మవీరసింగ్ చైనా నౌకాదళ విస్తరణ గురించి చేసిన వ్యాఖ్యలకు ఇదీ కారణం. తమకు ఎలాంటి ప్రమాదం లేనిచోటునకు చైనా నౌకాదళాలు నిరంతరం ఎందుకు చొచ్చుకొని వస్తున్నాయి?- ప్రమాదం కలిగించడానికేనన్నది సహజమైన సమాధానం. ఈ ప్రమాదం మన దక్షిణ, పశ్చిమ సరిహద్దులలో పొంచి ఉంది. దూకడానికి సిద్ధంగా ఉంది...
సొంత సరిహద్దులను రక్షించుకొనడం మాత్రమే స్వభావమైన లక్ష్యమైన దేశాల ప్రభుత్వాలు విదేశాలలో సైనిక స్థావరాలు స్థాపించవు. ఆయా విదేశాలు ప్రత్యేకించి అభ్యర్థించినప్పుడు మాత్రమే ఈ ‘స్వీయరక్షణ’ పరమావధి అయిన దేశాలు విదేశాలలో సైనిక స్థావరాలను స్థాపించడం అంతర్జాతీయ సమాజం ఆమోదించిన దౌత్య సూత్రం. ఇలాంటి అభ్యర్థనలను ఆయా విదేశాల ప్రభుత్వాలు తమ దేశానికి ఇతర దేశాలనుంచి ప్రమాదం ఏర్పడుతుందన్న అనుమానం కలిగినప్పుడు మాత్రమే చేస్తాయి, లేదా అంతర్గతంగా అరాజకశక్తులు, కిరాయిమూకలు తిరుగుబాట్లు చేసినప్పుడు ఆయా దేశాల ప్రభుత్వాలు ఇలాంటి అభ్యర్థనలను చేస్తాయి. ఈ బాహ్య దురాక్రమణలను లేదా అంతర్గత విద్రోహకాండను తిప్పికొట్టడానికి, అణచివేయడానికి తమ సైనిక పటిమ సరిపోదని భావించినప్పుడు మాత్రమే ఆయా విదేశాల ప్రభుత్వాలు ఇతర దేశాల సైనిక ప్రమేయాన్ని స్వచ్ఛందంగా కోరుకుంటాయి. కానీ ఇప్పుడు చైనాను ప్రపంచంలోని ఏ విదేశం కూడ తమ దేశంలో సైనిక స్థావరాలను ప్రత్యేకించి నౌకాదళ స్థావరాలను ఏర్పాటుచేయవలసిందిగా అభ్యర్థించలేదు. కానీ చైనా ప్రభుత్వం పెద్దఎత్తున విదేశాలలో సైనిక స్థావరాలను ఏర్పాటుచేయడానికి పథకాన్ని సిద్ధం చేసింది. ‘‘కొత్తయుగంలో చైనా జాతీయ రక్షణ’’- చైనాస్ నేషనల్ డిఫెన్స్ ఇన్ న్యూ ఈరా- అన్న ప్రణాళికను చైనా విడుదల చేసింది. ప్రణాళిక పేరు చైనా ‘‘జాతీయ రక్షణ’’- కానీ ఈ ప్రణాళికలో భాగం ‘‘అంతర్జాతీయ రక్షణను భద్రతను వివిధ దేశాలలో సైనిక సహకారాన్ని పెంపొందించడం’’ తన లక్ష్యంగా చైనా ప్రభుత్వం వివరించింది. ఇలా నిర్లజ్జగా నిర్భయంగా చైనా అంతర్జాతీయ సమాజంపై తన సైనిక ఆధిపత్యాన్ని రుద్దడానికి యత్నిస్తోంది. మన నౌకాదళాల ప్రధాన అధికారి ‘‘హిందూ మహాసముద్రంలో పెరిగిపోతున్న చైనా నౌకాదళ ఆధిపత్యం’’ గురించి ప్రస్తావించడానికి ఇదీ ప్రాతిపదిక!
గతంలో అమెరికా, రష్యా దేశాలు ప్రపంచమంతటా తమ సైనిక స్థావరాలను ఏర్పాటుచేయడం చరిత్ర, సైనిక కూటములను ఏర్పాటుచేయడం చరిత్ర. అమెరికా నాయకత్వంలోని ‘నాటో’- నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్- ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి-, సోవియట్ రష్యా ఆధ్వర్యవంలోని ‘వార్సా’ కూటమి ఉభయ దేశాల ప్రపంచ ఆధిపత్య ఆకాంక్షలకు అనుగుణంగా పుట్టుకొచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటినుంచి, క్రీస్తుశకం 1940వ దశకం చివరి నాటినుంచి 1990వ దశకం ఆరంభంవరకు అమెరికా రష్యాల మధ్య నడచిన ‘ప్రచ్ఛన్నయుద్ధం’- కోల్డ్‌వార్-లో ఈ రెండు ‘కూటములు’ ప్రధాన దురాక్రమణ భూమికను నిర్వహించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పశ్చిమ ఐరోపా దేశాలు అమెరికా ప్రాబల్యం కింద ‘నాటో’లో చేరాయి. తూర్పు ఐరోపా దేశాలలోకి రష్యా చొఱబడింది, భౌతిక దురాక్రమణను, వ్యూహాత్మక దురాక్రమణను సాగించింది. ఫలితంగా పోలెండ్, తూర్పు జర్మనీ, రుమేనియా, హంగరీ తదితర తూర్పు ఐరోపా దేశాలలో ఏకపక్ష ‘కమ్యూనిస్టు’ నియంతృత్వాలు నెలకొన్నాయి. పోలెండ్ రాజధాని ‘వార్సా’. ఈ ‘వార్సా’ పేరులోనే రష్యా నాయకత్వంలోని సైనిక కూటమి ఏర్పడడం చరిత్ర... 1989లోను, 1991లోను తూర్పు ఐరోపా దేశాలలోను, రష్యాలోను ఏకపక్ష ‘కమ్యూనిస్టు’ రాజ్యాంగ వ్యవస్థలు పతనం అయ్యేవరకు సోవియట్ రష్యా యథాపూర్వకంగా పదిహేను స్వతంత్ర దేశాలుగా విడిపోయేవరకు ‘వార్సా’కూటమి కొనసాగింది, అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య సమరం నడిచింది. వివిధ దేశాలు, సముద్రాలు ఈ రెండు పెత్తందారీ దేశాల సైనిక కలాపాలకు, ఆర్థిక రాజకీయ ప్రాబల్యానికి గురికావడం ‘ప్రచ్ఛన్న’యుద్ధ చరిత్ర... 1991లో సోవియట్ రష్యా సామ్రాజ్యం విచ్ఛిన్నంకావడంతో అమెరికా ఏకైక ‘అగ్రరాజ్యం’గా అవతరించింది, అమెరికా దురహంకారం మరింత పెరిగింది. గత పదిహేను ఏళ్లుగా చైనా అమెరికాతో పోటీపడుతోంది. ప్రచ్ఛన్నయుద్ధం మళ్లీ మొదలైంది.. అమెరికా, చైనాల మధ్య....
ఇలా పోటీపడుతున్న చైనా ఈ ‘వ్యూహం’లో భాగంగా మన దేశానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక దురాక్రమణను ఆరంభించింది. బర్మానుంచి పాకిస్తాన్ వరకూ మన దేశం చుట్టూ వ్యాపించి ఉన్న సముద్ర జలాలలో చైనీయ నౌకాదళాల చొఱబాటు ఈ వ్యూహాత్మక దురాక్రమణలో భాగం. ఆఫ్రికా ఖండంలోని ‘జిబౌటీ’లో ఇదివరకే చైనా నౌకాదళ స్థావరాన్ని మాత్రమే కాదు, త్రివిధ సైనిక దళాల సమగ్ర స్థావరాన్ని ఏర్పాటుచేసింది. ఈ స్థావరం మన పశ్చిమ సముద్ర తీరంపై గురిపెట్టి ఉంది... చైనాను నిరోధించడానికి, చైనా దురాక్రమణను తిప్పికొట్టడానికి మనం కూడ సమాయత్తం కావాలన్నది మన నౌకాదళాల ప్రధాన అధికారి చెప్పిన మాట...