జాతీయ వార్తలు

బయట పడిన సల్మాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్ అండ్ రన్ కేసులో అభియోగాలు కొట్టివేసిన ముంబయి హైకోర్టు
ప్రాసిక్యూషన్ వాదనలో పసలేదన్న న్యాయమూర్తి

ముంబయి, డిసెంబర్ 10: పదమూడు సంవత్సరాల నాటి హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన ప్రస్తుం బెయిల్‌పై ఉన్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ముంబయి హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మద్యం మత్తులోనే సల్మాన్ కారు నడిపి పలువురి మరణానికి కారణమయ్యారన్న అభియోగాన్ని ప్రాసిక్యూషన్ నిర్ద్వంద్వంగా నిరూపించలేక పోయిందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్థారిస్తూ వెలువడిన తీర్పును కొట్టివేసిన హైకోర్టు న్యాయమూర్తి ఎఆర్ జోషి ‘ప్రాసిక్యూషన్ అందించిన సాక్ష్యాధారాలు బలహీనంగా ఉన్నాయి’అని తెలిపారు. దీని దృష్ట్యా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ కేసులో ముఖ్యమైన సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేయక పోవడం, గాయపడ్డ వారి వాదనల్లో పొంతన లేక పోవడం వంటి ఎన్నో లోపాలు ప్రాసిక్యూషన్ కేసులో ఉన్నాయని న్యాయమూర్తి జోషి తెలిపారు. సల్మాన్ ఖాన్ మాజీ అంగరక్షకుడు రవీంద్ర పాటిల్ ఓ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంపై న్యాయమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ మద్యం మత్తులో ఉన్నాడంటూ పాటిల్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఎంత మాత్రం విశ్వసించలేమని తెలిపారు. కేవలం అతడిచ్చిన వాంగ్మూలం ఆధారంగా సల్మాన్‌ను దోషిగా నిర్ధారించలేమని తెలిపారు. మొదట్లో సల్మాన్‌కు వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చిన పాటిల్ అనంతర కాలంలో అందులో ఎన్నో మార్పులు చేశాడని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో సల్మాన్‌ను దోషిగా అతడు పేర్కొన లేదని, కానీ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో మాత్రం తన వాదన మార్చుడున్నాడని హైకోర్టు న్యాయమూర్తి జోషి తన తీర్పులో వెల్లడించారు. ప్రమాదం జరిగిన 2002 సెప్టెంబర్ 8న టయోటో కారులో సల్మాన్‌తోనే ఉన్న ఆయన స్నేహితుడు కమాల్ ఖాన్‌ను ప్రాసిక్యూషన్ విచారించాల్సి ఉండాల్సిందన్నారు. బలమైన అనుమానం ఉన్నంత మాత్రాన ఓ వ్యక్తిని దోషిగా పరిగణించజాలమని..అందుకే సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తున్నామని న్యాయమూర్తి వెల్లడించారు.