సాహితి

విశ్వనరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీకటిని చిదిమి
తెలి వేకువ వేగుచుక్కగా
అతని నుదుటిపై ఎర్రని తిలకం
నెత్తుటి సూరీడ్ని పుష్పిస్తుంది
కాలం కాలనాగై కాటేసిన సందర్భాలను
రాలిన కన్నీటి చుక్కల్లో లుప్తపరుస్తూ
అతడు... మరో ప్రస్థానానికై
నిప్పుల గుండంపై పేగు పాశానికి
భస్మాభిషేకం చేస్తాడు!
అజ్ఞాత దుఃఖార్తులకు
వేదన రోదన మిన్నంటిన శోక హృదయాలకు
పగిలిన గుండె చప్పుడును వినిపిస్తాడు
శివం శవమైన చోట...
దింపుడు కళ్లెం లేని మనసు గోసను
కన్నీటి సంద్రంగా మార్చిన
ఒకానొక బాధామయ సందర్భానికి
అతడు... ఆజన్మాంత సాక్షి!
నిత్యం చావు డప్పులను
వౌన ఘోషలుగా వింటూ
దేహి అంటున్న శూన్య హస్తాలతో
దుఃఖ తిమిరాలను చీలుస్తూ
ఏడేడు లోకాల వైతరిణిని దాటించే
స్థితప్రజ్ఞుడతను!
దేహ మాళిగలను పుడమి గర్భంలో
పూడ్చిపెడుతూ...
చితి మంటల్లోని అగ్ని నక్షత్రాలను
అనితరసాధ్యంగా అంబరానికి చేరదీసే
విశ్వనరుడిగా...
పునరపి చక్ర భ్రమణంలో
నిర్వాణాన్ని నివేదించే అతడు
ఇంటింటి వీధి మనిషి!!
*
- బి. కళాగోపాల్, 9441631029