సాహితి

తెలుగు మహాప్రభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుపెన్నండును గాంచనట్టి పగిదిన్ ముంచెత్త కోలాహలం
బనగా తెన్గు మహాసభల్ మహిని సౌహార్దమ్ము వీచన్ ఘనా
ఘనమై కావ్యమరంద మొల్కెను వియద్గంగా తరంగంబుగాన్
మన రాష్ట్రంబయె తల్లి భారతి మెడన్ మాణిక్యహారమ్ముగా

ఘనమై మ్రోగె సభావిపంచిక తెలంగాణమ్ము పల్కించుచున్
వనమై తెన్గు పరీమళమ్ము ఎగసెన్ వ్యాలోల స్రోతస్వినీ
స్వనమై కమ్ర కవిత్వముల్లసిల ఆస్వాదించ వీచే ప్రభం
జనమై ధీజన సంద్రమై సభలు సౌజన్యమ్ము పండించుచో

తెలుగుదనమ్ము వుట్టిపడ తేజరిలెన్ పలుచోట్ల వేదికల్
తొలకరి ముందె వచ్చెనీన తోరణముల్ కురిపించె పుప్పొడుల్
తెలుగు గజళ్లు పద్యములు తీయని పల్కుల మేళవింపుగా
తెలుగు మహాసభల్ కొలువుదీరెను సందడి చెన్నుమీరగన్

ఒగ్గు కథలలోని నిగ్గు గ్రోలెను చెవులు
యక్షగాన ధునికి కుక్షినిండె
కవన పవనములకు కంపించె హృత్తంత్రి
తెలుగు ప్రభలు సభలు తీరినపుడు

పల్లె పడతి పంచప్రాణాలు బోనాలు
జానపదుల కథలు గానసుధలు
అమ్మభాషలోని కమ్మందనాలకు
పలుకు తేనెలమ్మ పులకరించె

పేర్ని నాట్యరీతి భరతజాతికి కీర్తి
గోండుపాట పల్లె గునుగుతోట
అతికె గుండె గుండె బతుకమ్మ పూదండ
తెలుగు సభలు ప్రభలు చిలుకునపుడు

చింది యక్షగాన బృందాల చెలువమ్ము
చింది కనుల ముందు విందుచేసె
పలు రకాల రుచుల తెలుగింటి వంటలు
స్వాగతమ్ము పలికె ప్రాంగణముల

మనసా రామన తల్లిభాషను జనుల్ మాటాడుటే మాన్యలై
జన సంకల్పమె ప్రేరణమ్ముగ సదా సర్వోర్విశ్లాఘించ శా
సనముల్ తీర్పులు బోధనల్ తెనుగు భాషన్ సాగి శోభిల్లినన్
తెనుగన్నింట ప్రయుక్తమై చెలగదే తీరొక్క పూదోటగా

- టి.హెచ్.నటరాజారావ్ 8106243636