సాహితి

వెన్ను చూపని నది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిచ్చోడు లేని ఊరుంటదా
కుక్క కాటులేని మనిషుంటాడా
కలుపు లేని పొలముంటదా
కొంగలు విసర్జించని చెట్టుంటదా
అవమాన గాయాలను దాటినోడే
గాగనాన వేకువయతడు!

చినిగిన ఆకుల్ని కుప్పేసుకొని
వొల్ల వొల్ల దుఃఖిస్తేట్ల
అయనదానికి కానిదానికి
పక్కింటోని అనుమానించి నిందిస్తెట్ల?

మొగ్గల్ని గిల్లిండ్రని
పువ్వులు రేపు కండ్లు తెరువకుంటుంటవా
కాలువను ముక్కలు ముక్కలు తెగ్గొట్టిండ్రని
నది కాళ్లు ముడ్సుకుంటదా!

పొయ్య మండని మాటల కట్టెలు
పిన్నీళ్లు మసులని మంటల రాగాలు
పొద్దుమూకని పీట్కాలు
అమ్మకు రోజు యధాతథమే
అయనా అమ్మ బువ్వొండి ఇంటిని దాటుతది
ఊరును దాటుతది
అమ్మెన్నడు ఎవరిని నిందించదు
అమ్మ వెన్ను చూపని నది

సూర్యున్ని
ఊసేవాళ్లు ఊస్తుంటారు
సాపిచ్చేవాళ్ళు సాపిస్తుంటారు
సాకపోసేవాళ్ళు పోస్తుంటారు
గ్రహణాలు గొంతులెన్ని చించినా
కాలానికి సూర్యుడే వెలుగు
చీకటికి చంద్రుడే వెలుగు

- వనపట్ల సుబ్బయ్య