సాహితి

చిరుద్యోగుల ఇక్కట్లు - చెప్పరాని ముచ్చట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వీరేశలింగం, గురజాడ, రాజరామమోహన్‌రాయ్, గాంధీలు వచ్చాక భూమి బరువెక్కింది, గాలి తేలిక పడింది. సంస్కార బీజాలు యువకుల హృదయాల్లో పడి మార్పుకి అనువైన మానసిక వాతావరణాన్ని కల్పించుకుంటున్నై.. మనుషులు మారుతున్నారు. జీవితాన్ని మార్చుకుంటున్నారు; సంపూర్ణ మానవ హృదయంతో సమస్యా పరిష్కారానికి పోబోయి నిర్వహణలో కోరి కథానాయకుడు కావడమో, పరిణామంగా జీవితాల్తో ప్రయోగాన్ని జరిపి విషాదాంత ప్రణయగాథల్ని సృష్టించడమో జరుగుతూ వస్తోంది’- ఈ పదజాల కీ.శ. పురాణం సుబ్రహ్మణ్య శర్మ కథానిక ‘అనవసరపు దాంపత్యం’లో నాందిగా చోటుచేసుకుంటాయి.
ఇందులో కథానాయకుడు చిరుద్యోగి. ఆంధ్రప్రదేశ్‌లో బతుకుబాట ఏర్పరచుకోలేక కలకత్తాకు వెళ్లి జూట్ మిల్లులో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక వెదుక్కోవలసింది ఉండటానికి గూడు. ‘పదిమందికి ఉపాధిని కల్పించే ఆధారం ఏర్పడితే అది తెనుగు దేశపు పొలిమేరల్లో లేదు.. పిల్లలు ఎలుకలు పందికొక్కుల లాంటి మనుషుల్తో నిండిపోయిన దేశంలోని చీకటి మనుషుల్ని మెడ పట్టుకు బైటికి తరుముతోంది! గది కాళీగా వున్నదని తెలుసుకుని దోర్నాను సహాయంతో ఒక మేడలోని నూట యెనభయ్యో గది వద్దకు చేరుకున్నాడు శ్రీహరి. వచ్చీరాని వంగ భాషలో పదాలు కూర్చుకొని మాట్లాడడం ఆ గదిలో వున్న ఆమెకు తెలుగు మనిషినని తెలిసిపోయింది. గది అద్దె వ్యవహారం వివరాలు కనుక్కోవడంలో ఆమెకు కంటినీరు తెప్పించి, ఆమె కథనం అంతా తెలుసుకోగలుగుతాడు. ఆవిడ ఇచ్చిన టీ కప్పు చప్పరిస్తూనే తన కథంతా ఆమెకు విన్నవించుకుంటాడు. ఆమెతో ‘సహజీవనం’ జరపటానికి దాదాపు ఏర్పాటుచేసుకుంటాడు. ప్రేమను గురించి, జీవితంలో స్వయం పోషకత్వం లేకపోవడంతో ఇబ్బందులు గురించి ఆమెకు లఘు ఉపన్యాసం ఇచ్చి, ఎదురుమాటల కూడా పడతాడు. ‘మీరిప్పుడే పప్పులో కాలువేసి కడుక్కుంటున్నారు గనుక, తమరేదేనా ఉద్యోగం చేయండి. ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం. మీరు నెగ్గితే, మీరేం చెప్తే నేను ఆ పని చేస్తూ గౌరవంగా, మిమ్మల్ని కనిపెట్టుకు వుంటాను. ఈ ఒడంబడిక మీద సంతకం చేస్తారా?’ అని అడిగి ఆమె ఆమోదం పొందుతాడు. ఇద్దరూ కలిసిపోయి సరదాగా సినిమాలకు, షికార్లకు తిరుగాడుతారు. ఆమె గురుత్వంలో అనేక కొత్త సంగతులు నేర్చుకుంటాడు శ్రీహరి. ‘జీవితాన్ని తెలుసుకున్న ఆమె నిండైన వక్షస్సు అతడి పార్శ్వమంతా పులకింపజేసింది అతని ముఖాన్ని తన ఒళ్లో దాచుకుని ఆనందంతో పరవశమైపోతూ పూర్తిగా వ్రాలిపోయింది శారద’. ఒక దశాబ్దం ఇలా కులాసాగా జరిగిన తర్వాత శ్రీహరి ఏం చెబుతాడో చూడండి: ‘నేను శారదని అతి కష్టంమీద మర్చిపోగలిగాను. ఆమె పల్చటి కాంతివంతమైన ముఖం, చురుకైన చూపులు నా అసహాయత్వాన్ని గ్రుచ్చి గ్రుచ్చి ప్రశ్నిస్తాయి.. జరిగిందల్లా రుూ దాంపత్యం మాకు అవసరం అయినప్పటికీ రుూ రకమైన జీవితానికి మేం అర్హులం అనిపించుకోలేకపోయాం.. సమ్మెలు వచ్చి ఫ్యాక్టరీ మూసేశారు. మా చుట్టూ వున్న సామాజిక వ్యవస్థ కుంచించుకుని మాకు దాంపత్య జీవనం అనవసరం అన్నంత క్రూరంగా భయంకరంగా సత్యాన్ని చేరేసరికి నాకు మతిపోయినట్లయిపోయింది.. మా అనవసర దాంపత్యానికి ప్రతిఫలంగా ఓ ఆడపిల్ల! ఒకరికొకరం ఏమీ ప్రయోజనం లేదని తెలుసుకున్నాక మాటా మంతీ లేకుండా విడిపోయాం.. శారదను గురించి ఆలోచించవలసివస్తే భయంకరమైన భావాలు నిర్దాక్షిణ్యంగా నన్ను చీల్చి చెండాడేవి’.
కథాకాలం గడుసుగా నడిచిపోయి, దేశానికి స్వరాజ్యం వస్తుంది. దేశం స్వయం సమృద్ధి సంపాదించుకుంది. అయినా శ్రీహరి శారదను సంపాదించుకోలేకపోయాను. ఆ అనవసరపు దాంపత్య ఫలాన్ని ఆడపిల్లను భుజానే్నసుకుని ఎన్నాళ్ళు ఏ అగాచాట్లు పడ్డదో, ఎక్కడ విధిని ఏమని దూషించిందో నాకు తెలియదుగాని ఇప్పటికీ ఎప్పటికీ ఆమె జాడ తెలీదు’ అని పరితాపం తెలుపుతూ కథను ముగింపు చేస్తాడు. కలకత్తాలో పసిబిడ్డను రోడ్డువార పడుకోబెట్టి అడుక్కుంటున్న యువతిని చూచినపుడు అతనికి అనేక ఆలోచనలు వస్తాయి. తన అనవసర దాంపత్యం, కలిగిన ఆడపిల్ల గుర్తుకువచ్చి అప్పటి ప్రియురాలి సంగమం తలుచుకుంటూ పరితపిస్తాడు. ‘మొత్తానికి దేశం మారింది. కాని.. కాని..’ మనుషుల బతుకులే మారలేదు. అప్పటి సామాజిక స్థితిగతులు, నిరుద్యోగం, స్ర్తిల అసహాయత, దైహిక ఆర్థిక అవసరాల దృష్ట్యా మనుషులు చేసుకునే ఒప్పందాలు, విశ్వాసాల తాత్కాలికత.. ఇలా అనేక విషయాలను ప్రస్తావించే రుూ కథానిక, చారిత్రక నేపథ్యంలో తప్పకుండా చదువవలసిన కళాఖండం. ‘నీలి’, ‘శివకాంత’ వంటి ప్రామాణికమయిన కథలు అనేకం రాసిన శ్రీ సుబ్రహ్మణ్య శర్మ కేవలం కథా రచయితగానే కాక, ప్రసిద్ధ నవలాకారుడుగా, సంపాదకుడిగా ‘పురాణం సీత కబుర్ల’ హాస్య రచయితగా పేరు పొందారు. చివరి రోజుల్లో ఒక నవలిక వ్రాస్తూ అది పూర్తికాకుండానే పరమపదించారు.

- శ్రీవిరించి, 09444963584