సాహితి

సౌజన్యమూర్తి ఘనశ్యామల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్తిత్వంలోని ప్రత్యేకతవల్ల కొంతమంది గుర్తుండిపోతారు. పేరులో ప్రత్యేకతవల్ల కొంతమంది గుర్తుండిపోతారు. కానీ వ్యక్తిత్వము, పేరులోని ప్రత్యేకత వల్ల గుర్తుండిపోయేవారు ఘనశ్యామల ప్రసాదరావు. వారి పూర్తిపేరు కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు. మా కుటుంబంతో వారికి కొన్ని దశాబ్దాల ఆత్మీయానుబంధం ఉంది.
అమలాపురం ఎస్‌కెబిఆర్ కళాశాలలో ఘనశ్యామలగారు సంస్కృతోపన్యాసకులుగా పనిచేశారు. సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అగస్త్య పండితుడు వ్రాసిన బాలభారతంపై సమర్పించిన పరిశోధనపత్రంపై (పిహెచ్‌డి) వారికి స్వర్ణపతకం లభించింది. అధ్యాపకునిగా తమ జీవితాన్ని కొనసాగిస్తూనే సంఘకార్యానికి తనను సమర్పించుకున్నారు. ఆయన దేవీ ఉపాసకులు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవక్‌గా వారు అందించిన సాహిత్యం అమూల్యమైనది. సంఘ పాటలలో ఆయన వ్రాసినవి ఎన్నో ఉన్నాయి. ‘శివోభూత్వా శివం యజేత్’ అన్న వేదోక్తిని పట్టుకొని ఆయన ‘శివుడే తానై శివుని కొలిచినటు రాష్ట్ర దేవతారాధనము’ అన్న పాటను వ్రాసారు. ‘అభినవ హైందవ అభ్యుదయోదయ ప్రభాతభేరి మ్రోగింది’ అన్న పాట కూడా ఆయన వ్రాసినదే. ‘‘వంద కంద పద్యాలు కంఠస్థం చేస్తే నూట ఒకటో పద్యం దానికదే వస్తుంది. అలాగే షేక్‌స్పియర్ వంటి వారి రచనలలోని పేరాలను కంఠస్థం చేస్తే ఆంగ్లభాష బాగా వస్తుంది’’ అని ఘనశ్యామల అంటుండేవారు. ఆర్‌ఎస్‌ఎస్ ద్వితీయ సర్‌సంఘ్‌చాలక్ గురూజీ గోళ్వార్కర్ ఆంధ్ర ప్రాంతంలో పర్యటించినపుడు ఘనశ్యామలగారు తెలుగు అనువాదం చేసేవారు. ఆయన గొప్ప పండితుడు. గురూజీ ప్రసంగాలను హెచ్.వి.శేషాద్రిగారు సంకలనం చేస్తే వాటిని తెలుగులో అనువదించే బాధ్యత ఘనశ్యామలగారిపై పడింది. ఆ అనువాదం ‘పాంచజన్యం’గా ఎందరికో మార్గదర్శనం చేస్తోంది. భారతమాతను స్తుతిస్తూ వ్రాసిన ‘్భరతమాతృస్తవము’, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలపై రాసిన ‘ప్రజాపోరాటం’, ఆంధ్ర వీరులైన ముసునూరి నాయకులపై పుస్తకం ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. దేవాలయ వ్యవస్థపై దాదాపు పదిహేను సంవత్సరాలు ఆయన పరిశోధనలు, అధ్యయనం చేశారు. దాని ఫలితమే ‘్భరతదేశంలో విగ్రహారాధన ప్రారంభ వికాసాలు’, ‘్ధ్వంసమైన మన దేవాలయాలు’, ‘జీవించే దేవాలయం’ అన్న పుస్తకాలు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్రను వ్రాసిన ఆయన తాపీ ధర్మారావు రాసిన ‘దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు’ వంటి రచనలకు సమాధానంగా ‘పరమపద సోపానాలు - దేవాలయాలపై బొమ్మలు’ అన్న పుస్తకం వ్రాసారు. చిత్రలేఖనం, అవధానము, నేత్రావధానములు ఆయన ప్రవృత్తులు. మా అమ్మ డా. రమణమ్మ ‘ద్విపద భారతకావ్య పరిశీలనము’పై పిహెచ్‌డి చేస్తే దానిని పుస్తకంగా ముద్రించినప్పుడు ముఖచిత్ర రూపకల్పన చేసినది ఘనశ్యామలగారే. జాతీయ సాహిత్య పరిషత్‌కు ఆంధ్రప్రదేశ్ సంస్థాపక కార్యదర్శిగా, సంస్కారభారతి అఖిల భారత ఉపాధ్యక్షులుగా వారు ఎనలేని సేవలందించారు. 2001-03 వరకు నేషనల్ బుక్ ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. సద్గురు శివానందమూర్తిగారితో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఈశాన్య భారతంలోని మారుమూల అటవీ ప్రాంతాలలో శివానంద మూర్తిగారితో కలసి ఆలయాలను సందర్శించారు. ‘జాగృతి’ వారపత్రికతో ఘనశ్యామలగారికెంతో అనుబంధముందంటే, ఆ పత్రిక స్వర్ణోత్సవ వేడుకలకు కొద్దిరోజులకు ముందే వారి కాలికి శస్తచ్రికిత్స జరిగింది. అయినా హైదరాబాదులో జరిగిన ఆ స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
స్వర్గీయ కొవ్విరెడ్డి జగ్గారావు భారతీయ శిక్షణ మండల్ జ్యేష్ఠ కార్యకర్త. వారు భారతీయ పౌరాణిక, ఆధ్యాత్మిక, విజ్ఞాన, చారిత్రక విశేషాల గురించి వివరిస్తూ ఆరు పెద్ద గ్రంథాలను వ్రాసేరు. వాటిని ముద్రించక మునుపే ఆయన 2007లో స్వర్గస్థులయ్యారు. చాలాకాలం తరువాత వాటిని ముద్రించాలనే సంకల్పంతో మా నాన్నగారు ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం, డా. ఘనశ్యామల ఆ గ్రంథాల పరిష్కర్తలుగా బాధ్యత వహించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే ఘనశ్యామలగారు ఆ ఆరు గ్రంథాల పనిని చూసేరు. మొదటి పుస్తకం ముద్రణ పూర్తయింది. గత ఏడాది డిసెంబర్ 19న ఆ పుస్తకావిష్కరణ కూడా జరిగింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఘనశ్యామలగారు ఆ సభకు వచ్చి ప్రసంగించారు. అదే వారి ఆఖరి ప్రసంగము.
సంఘ్ పెద్దలు ఒక కార్యకర్త ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వారి కుటుంబ పెద్ద వచ్చినట్లే అనిపించేది. వారు చెప్పే మంచిచెడులు తమ పెద్దలు చెప్పినట్లే అనిపించేది. ఘనశ్యామల గారు కూడా అలా ఎందరికో ఒక కుటుంబ పెద్ద.
*
స్మృత్యంజలి

- దుగ్గిరాల రాజకిశోర్, 8008264690