సాహితి

తడిగా తగులుతున్న నటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను
నా ఎదని కన్నీళ్ళలో నానబెట్టాను

నా చర్మం చినిగి పాడైపోయింది
అదింకా దుఃఖంలో సజీవంగానే ఉంది

నా కళ్ళు సిగ్గుపడుతున్నట్లూ
నటిస్తున్నాయి

అనుభూతుల ఆర్ణవాల్ని
నాలోనికి స్వాగతిస్తున్నాను

నేనిప్పుడు శిక్షణ కోసం పోవాలి
ఎలా దుఃఖించాలో అని

నాలోనికి ఓ మనిషిని
పూలదండలా ధరించాలి
నన్ను నేను బలపరుచుకోవడానికి

ప్రకృతి నన్ను అవమానిస్తుంది
ఆకాశం తన కొరడా చేతులతో వేధిస్తుంది

ఎందుకంటే
నాకు ఎలా జీవించాలో తెలీదు కాబట్టి

- రమేశ్ కార్తిక్ నాయక్