సాహితి

అక్షర స్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజురోజుకీ
నా అనుకున్నవారు
నన్ను నిశ్శబ్దానికి చేరువ చేస్తుంటే...
అంతరంగంలో
ఆవరిస్తున్న అగాథాన్ని
అక్షరాలతో అధిగమిస్తున్నా!
సాంత్వన కోసం
సృజన కపోతాల ఆసరాతో
శే్వతపత్రంపై...
అక్షర చేతనా పతాకాన్ని ఎగురవేస్తున్నా!
మైత్రి అనే ప్రమిదలో
భావుకత తైలం పోసి
అందమైన అక్షర వత్తులతో...
అభ్యుదయ జ్యోతిని వెలిగిస్తున్నా!
అందరికీ దగ్గరయ్యేందుకు
హృదయాంతరాల్లో
గుసగుసలాడే ఊహలకు
అక్షర రెక్కలు తొడిగి
తెల్లకాగితంపై...
మయూరంలా నాట్యం చేయస్తున్నా!
పోగొట్టుకున్నచోటనే
అయనవారిని వెతుక్కునేందుకు
గుండె లోతుల్లో
నిద్రాణమై వున్న నాదానికి
అక్షర స్వరాలు కూర్చి...
స్నేహగీతం ఆలపిస్తున్నా!

- దాస్యం సేనాధిపతి, 9440525544