సాహితి

పొలం నా స్వస్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొతం కావడానికి
దీని బతుకు ఎంతో అతగతం అయ్యంది

తనువులోంచి
పచ్చని జెండాలుగా ఎగిరేసిన
వృక్షాలకు మరణశిక్ష రాసిండ్రు
ఎత్తు నదలును
సమసమానంగా హత్తుకుంది

సువిశాలంగా విస్తరించిన తలం
మడులుగా సుడులు తిరిగి
ఎన్నో వడులు పడింది

నాగలితో గీతలు గీసి
నుదుటి నా భవిష్యత్తు రాతలు రాసింది
పొడి పొడి జీవితంలోకి
సడి చేయని నీళ్ల తడి
సమాగమంతో పులకించిపోయంది

ఇంకా ఏదో కావాలని
నోరు తెరిచి చూస్తుండగానే
నారు చింత చిగురు చీర అయ్యంది

సాలు ఇరువాలు దున్ని
గొర్రు కొట్టిన భూమిలో
గాజుల గలగలలు వరి మొక్కలకు
చక్కదనాల పాటలతో ప్రాణం పోసాయ
కలుపునూ బెరికిని
అలుపు లేకుండా ఏరిపారేసిండ్రు

గూడ ఏతం మోట
చెరువు కాలువలు
ఎత్తి పోయనప్పుడు
నేల కారీజు ఖాతాలోకి
జమ అయతనని భయపడింది

రైతు కూలీ
వడగాలి నీటి ఎద్దడికి
రెపరెప కొట్టుకొని వల్లి పోయండ్రు
నేనున్నానంటూ
బోరింగ్ వచ్చి
వ్యవసాయం ఇసిరెల్లో చేరింది

వృత్తులు కల్లం కల్లమై
చిల్లర చిత్తు అయనై

కాలాలు కార్తెలు ఎటమటమైనయ్
ట్రాక్టర్ హార్వెస్టర్
ఎరువులు పురుగుమందులు విత్తనాలు
ఒక్కటొక్కటిగా వచ్చి
పొలాన్ని ఎగిర్త పెట్టినయ్
రైతు ఎంత కైరతుగా వున్నా
తేప తేపకు పరువు
క్యాలికప్పి పోతుంది

సాంకేతికత బాగు చేస్తుందనుకుంటే
దొంగా చీకటి ఒక్కటైనట్లు
పంటలో దొంగలు పడ్డరు

పొలం హాలాహలం అయ్యంది
ఎండిన పంటకు మంట పెట్టుకునే
కాలం దాపురించింది

పండుతే ధర రాదు
ధర వస్తే పంట పండదు

వ్యవసాయం సాయమంతా
దళారి వేషాలకు
దశావతారాల విశ్వరూపం

ఏది ఏమైనా
కడుపుల ఎంత దుఃఖం ఉన్నా నవ్వుకుంటూ
మనిషికి బుక్కెడు బువ్వ పెట్టి
పొలం నా బలం, నా బలగం
పొలమే నా స్వస్థలం

- జూకంటి జగన్నాథం 9441078095