సాహితి

కాకమ్మ త్యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్ప పరిమళాన్ని ఆఘ్రాణిస్తాం
కారణమైన పూవును మరుస్తాం
నాలుక తో రుచిని చవి చూస్తా
పంట చేసిన చేయిని విస్మరిస్తాం
కీర్తి పతాక ఎగరేస్తాం
మోసిన చేతులను దులిపేస్తాం
కమ్మదనం జుర్రుకుంటూ
స్వేదప్రాణిని ఛీ కొడతాం.

కాకి కోయిల
రెండూ నల్లనివే
ఒకదానిపై
చివుర్లు తింటుందని కవితలల్లుతాం
ఇంకోదానిపై
చిరాగ్గా చేయి విదిలిస్తాం
ఒక దానిపై ఉగాది కవిత రాస్తాం
ఇంకోదానికి పిండ ప్రదానం ప్రాధాన్యమంటాం

రూపమే ప్రామాణికమా
రెండూ సమానమే మరి
గాత్రమయితే చెప్పాల్సిన పనే లేదు...
గుడ్డును కాకితో పొదిగించిన
కోయిలను కీర్తిస్తాం
బిడ్డకు రూపు నిచ్చిన కాకిని వెక్కిరిస్తాం
కోయిల దోపిడిని ప్రశంసిస్తాం
కాకమ్మ నీది త్యాగమేనమ్మా
కాని నీకు చీదరింపులేనమ్మా ..

ఎర్రని కళ్లతో కనిపించే
దోపిడిని వేనోళ్ల శ్లాఘిస్తాం
నల్లని శ్రమరూపాన్ని
దూరంగా పక్కకి నెడతాం
కనిపించే లోకాన్ని
సరిగా చూడలేని జనం
పరలోక ప్రాప్తికై
కాకిగోల చేయటం
రోజు వీక్షించే దృశ్యం
కనిపించే దృశ్యాన్ని శ్లాఘిస్తాం
కనిపించని త్యాగాన్ని విస్మరిస్తాం

- జంథ్యాల రఘుబాబు, 9849753298