సబ్ ఫీచర్

తెలుగు వెలుగు - గీతాంజలి మూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాలు మహత్తరాలు- అక్షర స్నేహానికి అష్టోత్తరాలు’- ఇది ఆయన ఆచరణాత్మకమైన నినాదం.
‘కన్ను తెరిస్తే సాహిత్యం- కన్ను మూస్తే సంగీతం. మనసు తెరిస్తే మమత్వం- మనసు మూస్తే వేదాంతం’-
అంతేకాక- ‘మనిషిగా ఆత్మగౌరవంతో బ్రతకటం, బ్రతకనివ్వటం (జజ్పళ ఘశజూ జళఆ జజ్పళ)’ ఇది ఆయన జీవన లక్షణం. ‘చదువుతూ ఎదగాలి, ఎదుగుతూ చదవాలి- జీవితాంతం చదువుతూనే బ్రతకాలి-’’ ఇది ఆయన జీవిత సందేశం.
ఇంతకీ ఆయన పేరు- శ్రీ ‘గీతాంజలిమూర్తి’. అలా అంటేనే సకల లలిత కళాకేళియైన తెనాలిలోని సాహిత్య-ఆధ్యాత్మిక ప్రియులకు తెలిసేది. ఆయన అసలు పేరు:- శ్రీ మునిపల్లె వేంకట లక్ష్మీనరసింహమూర్తి. విశ్వకవి టాగూర్ రచించిన ‘‘గీతాంజలి’’కి సరళాంధ్ర భావానువాదం చేయడంవల్ల గీతాంజలిమూర్తిగా ఆయన పేరుపొందారు. అదే వారి కలం పేరు అయింది. వృత్తి- యూనియన్ బ్యాంకులో ఉద్యోగం. 2001లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, తనకు నచ్చిన సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాల మీద స్వేచ్ఛగా వ్యాసాలను, పుస్తక సమీక్షలను వ్రాయడం, వాటిని డి.టి.పి.చేసి సుమారుగా డెబ్భైమంది మిత్రులకు పోస్టులోనూ, అంతర్జాలంలోనూ పంపడం, వాటిమీద స్పందించిన వారితో ఉత్తర ప్రత్యుత్తరాలను జరపడం చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు వీరు సుమారుగా నూట యాభైకి పైగా రచనలుగావించారు. వీరు 18 సంవత్సరాల వయస్సులోనే ‘ఆ యిల్లు’, ‘సప్తపది’, ‘స్ర్తిధర్మం’, ‘యుగధర్మం’ కథల్ని; ‘మధుబిందువులు’, ‘జాహ్నవి’- అన్న నవలల్ని వ్రాశారు. అవన్నీ ముద్రితాలైనాయి. ఆ తర్వాత జీవితంలో వయస్సు- మనస్సు పెరుగుతూ ఉండగా పొందిన అనుభవ పరిపాకంతో ‘గీతాంజలి’ అనువాదంతోపాటుగా ‘్భగవద్గీత’- ‘గీతామకరందం’ ఆధారంగా ‘గీతాసారం’ పేరుతో నూట పదిహేడు ఎంపిక చేసిన శ్లోక తాత్పర్యాల సంకలనం, ఆదిశంకరాచార్యులవారి ‘్భజగోవింద’ స్తోత్రానికి సరళ వ్యాఖ్యానం రచించారు ఆయన.
గీతాంజలిమూర్తిగారు తెనాలిలో జన్మించారు. విద్యాభ్యాసం అంతా దాదాపుగా తెనాలిలోనే. వీరు మొదటినుండీ నిత్య విద్యార్థి. మంచి పుస్తకాల పురుగు. ఎక్కడకు వెళ్లినా చేతిలో పుస్తకం ఉండవలసిందే! ఇప్పటికీ ఆ అలవాటుతోనే ఒకసారి జిల్లా శాఖాగ్రంథాలయంలో ఒక ప్రసంగంలో చెప్పిన వాక్యమే- ‘చదువుతూ ఎదగాలి- ఎదుగుతూ చదవాలి’ అనేది. ఇంకో విశేషం ఏమంటే- ఈయనకు వేదాంతం మీద జిజ్ఞాస, అవగాహన ఉద్యోగం చేసేటప్పుడే ఉంది. ఉద్యోగరీత్యా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో ఒక ఆశ్రమ విద్యార్థిగా చేరి ధ్యానయోగ సాధన చేశారు- వీరు. ఇప్పటికినీ శ్రీ పరమహంస యోగానందగారి ‘ఒక యోగి ఆత్మకథ’ను చదివి ప్రభావితులవుతూనే ఉన్నారు.
ఆధ్యాత్మికంగా - ఆదిశంకరాచార్యులవారు, స్వామివివేకానంద, రమణ మహర్షి, బుద్ధ్భగవానుడు, సాహిత్యపరంగా- రవీంద్రనాథ టాగూర్, శరశ్చంద్ర చటర్జీ, ప్రేమ్‌చంద్, తెలుగులో శ్రీపాద, గురజాడ, కొడవటిగంటి, జాషువా, శారద, శ్రీశ్రీ; సామాజికపరంగా- డా.అంబేద్కర్, కందుకూరి వంటి మహనీయులు- గీతాంజలిమూర్తిగారికి స్ఫూర్తి ప్రదాతలు. ఇంతగా స్ఫూర్తిమన్మూర్తులు కావడంవల్లనే మూర్తిగారు హేతువాదియైన ఆస్తికులుగా ఎదిగారు. ఇది చెప్పుకోదగ్గ విశేషం. ఈ క్రమంలో వీరు ప్రముఖ పత్రికల్లో వ్యాసాలు కూడా వ్రాశారు. ఘర్షణ లేకుండా దేశంలో శాంతి నెలకొనాలి అంటే ఎవరి బాధ్యతల్నివారు సక్రమంగా నిర్వర్తించాలన్నదే మూర్తిగారు ఎప్పుడూ చెప్పే సులభ సూత్రం. గీతాంజలిమూర్తిగారిలో ఇంకో విశేషం ఉంది. తెనాలి అంటే ప్రాణం వీరికి. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నప్పటికినీ వారి దేహం మాత్రమే అక్కడ- ఆత్మ మాత్రం తెనాలిలోనే. రెండుమూడు నెలలకొకసారి తెనాలి వచ్చి, అక్కడి సభా సమావేశాల ప్రాణవాయువును గుండెల నిండా పీల్చుకోనిదే ఆయనకు జీవితం సజావుగా గడిచినట్లుండదు. మళ్లీ మిత్రులకు ఉత్తరాల ద్వారా అందించాల్సిన సమాచారాన్ని పోగుచేసుకుంటున్నట్లుగా ఉంటుంది- ఆయన తెనాలి ప్రయాణం.
‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి!’ అన్న సూక్తి ఆయన ఉత్తరాలలో అక్షరాక్షరంలోనూ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. సుకుమారంగా, సున్నితంగా భావకాంతుల్ని వెదజల్లుతూ ఉంటాయి- ఆయన ఉత్తరాలు. చర్చనీయాంశాల్లో తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పవలసి వచ్చినప్పుడు కూడా ‘నొప్పించక, తానొవ్వక-’ అన్నట్లుగానే వాక్య విన్యాసం సూటిగానే ఉంటుంది. కనుకనే గ్రంథాలయోద్యమ నాయకులు కీ.శే. శ్రీ వెలగా వెంకటప్పయ్యగారు ‘మీ లేఖా సాహిత్యాన్ని కొనసాగించండి’ అని ఆశీర్వదించారు. అలా గీతాంజలిమూర్తిగారు అనేక భావాల్ని ఉత్తరాల ద్వారా పంచుకుంటూ- ఆనందాన్నీ- ఆరోగ్యాన్నీ పెంచుకుంటున్నారు- మిత్రులందరికీ వాటిని పంచుతున్నారు- పెంచుతున్నారు.
అయితే- గీతాంజలిమూర్తిగారివి ఎక్కువ భాగం వేదాంత విషయాత్మక చర్చాలేఖా వ్యాసాలే. సాహిత్యానుభూత్యాత్మక లేఖా వ్యాసాలు కూడా లేకపోలేదు. వీరి సాహిత్యాను భూత్యాత్మక లేఖకు ఉదాహరణం ఒకటి:- ఉయ్యూరు- ‘సరస భారతి’ సంస్థా నిర్వాహకులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్‌గారు సుమారుగా ఒకటి రెండేళ్ల క్రితం- కవుల, కవయిత్రుల రచనలుగా సేకరించి, ప్రచురించిన ‘మా అన్నయ్య’ అన్న గ్రంథానికి సమీక్షాలేక్షా వ్యాసాన్ని వ్రాస్తూ- గీతాంజలిమూర్తిగారు ‘‘---‘అమ్మ’లో సగము ‘అ-’, ‘నాన్న’లో సగము ‘న్న’. అవి రెండు కలిసిన ‘అన్న’ అగును-’’ అని ముదిగొండ సీతారావమ్మగారి కవితా వాక్యాన్ని పేర్కొంటూ ‘ఓహ్! ‘అన్న’ అంటే అందమైన అర్థాన్ని అలవోకగా అందించారీ చెల్లెమ్మ-’ అని అన్నారు. మరొక కవయిత్రి శ్రీమతి పద్మావతీశర్మ మురిసిపోతూ వ్రాసిన ‘అంతా నాకు దేవుడిచ్చిన అన్నయ్యలే’ అనే కవితను పేర్కొంటూ, ‘ఈ కవిత నిజంగా నా హృదయాన్ని కదిలించి, కరిగించి, కన్నీరొలికించింది. ఎందుకంటే- నాకూ తోడబుట్టిన చెల్లెళ్లు లేరు-’ అంటూ, ఈ వ్యాసం చివరలో ‘నా నలుగురు ఆప్తమిత్రుల భార్యలూ, మరిద్దరూ నా చెల్లెళ్లుగా లభించి, ‘అన్నయ్యా!’ అని నోరారా పిలిచి, నన్ను పులకింపజేసిన నా అనుభవాలూ- జ్ఞాపకాలూ గుర్తుకొస్తున్నాయం’టూ ఈ ఉత్తర వ్యాసం ద్వారా వాటిని విశదీకరించారు. 29-10-2016న ఈ ఉత్తరాన్ని దీపావళి సందర్భంగా వ్రాశారు. గీతాంజలి మూర్తిగారు- సాహిత్యమిత్రులకు మహత్తరంగా.
ఎస్.ఇన్నయ్యగారు రచించిన ‘సాహితీమూర్తులతో సహవాసం’- గ్రంథాన్ని గూర్చి వ్రాసిన సమీక్షాత్మక లేఖావ్యాసంలో (30-7-2017) కొన్నిచోట్ల గీతాంజలిమూర్తిగారి నిర్భయ నిశిత విమర్శ- మిత్రుల్ని ఆలోచింపజేసింది. అలాగే ఆకాశవాణి ప్రముఖ కళాకారులు- ఎ.బి.ఆనంద్‌గారి ‘మనజ్యోతి’- పత్రిక- అయిదు సంచికలపై గీతాంజలిమూర్తిగారు లేఖా వ్యాసరూపంలో స్పందించిన చందం ఆనందమాకందమే!
చివరగా ఒక మాట - లేఖాసాహిత్యం అనేది తెలుగు వాఙ్మయానికి క్రొత్త ప్రక్రియ ఏమీకాదు. చలం, బం.గో.రె., ఆరుద్ర, చలసాని ప్రసాద్, సన్నిధానం నరసింహశర్మ ఇత్యాదులెందరో ఈ ప్రక్రియను పరిపుష్టం గావించారు. అయితే- ఏ విధమైన ప్రయోజనాన్నీ ఆశించకుండా తమదైన విశిష్ట ధోరణిలో లేఖా సాహిత్య రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ ఉన్న ‘తెలుగు వెలుగు’గా గీతాంజలిమూర్తిగారిని (సం)్భవించవచ్చు.

- డాక్టర్ రామడుగు వేంకటేశ్వరశర్మ, 9866944287