Others

స్వప్నకాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటికైనా తప్పదు కదా
మనసు బీడుపడిన నేలగా ఎంతకాలం?
తన్మాత్రలు పూసరవెల్లులై
పరిగెట్టినంత దూరం
ఒకే ఒక్క కల కోసం నిరీక్షిస్తూ
ఇంకెంత జీవితాన్ని కోల్పోతావ్!
నీ కళ్లని స్వప్న దర్శనానికి డొనేట్ చేసినప్పుడే
ప్రపంచం నీనుండి దూరమైపోయంది
ఎవరి పెదవులపై
రెండు చిరునవ్వు పూల కోసం
జీవితాన్ని పంచుపర్వతంలా కరిగించావో
ఆ నీవాళ్ళే నిన్నొదిలేయటం దుఃఖదాయం
ఇంకెంత దుఃఖాన్ని మూట కట్టుకుంటావ్
తెగుతున్న దారానికి
యంకెన్ని ముడులు వేస్తావ్?
సామాజిక స్వప్నకాంక్ష అందని ఆకాశమే
ఏ యద్దరూ వొకేలా
స్పందించడానికి సమ్మతించని
ఈ నేలమీద ఎంత వృథా ప్రయాస?
గట్టు దాటని సముద్ర కెరటాల్లా
నీ ఆశయానికి
సరిహద్దు రేఖని వేరే ఎవరో నిర్ణయంచేశాక
ఇంకా ఆ పరిధిలోనే తపన
ఎంతవరకు న్యాయం?
కాలం గారడీలో నువ్వు కూడా
ఒక ఉపాధివే
ఇకనైనా కదిలిరా!
నిన్ననుసరించని వాళ్లని విడిచి
నీ నీడలో యల్లు కట్టుకున్న వాళ్ళకోసం
ఒక కొత్త కల కందాం!

-- గుర్రాల రమణయ్య, 9963921943