Others

వౌనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌనం..
బంగారమూ కాదు, గంభీరమూ కాదు
వౌనం..
ఘనమూ కాదు, సుగుణమూ కాదు
వౌనం... ఓ నిర్జీవ సంగీతం
ఓ నిర్బల సంకేతం
ఓ నిష్ఫల సందేశం

అన్యాయం ఎదురైనప్పుడు
నీతి అరుదైనప్పుడు
జాతి నిదరోయనప్పుడు
మూతి బిగించడం పాతకమే
మానవతపై ఘాతుకమే
గుండె పగిలినపుడు
గొంతు పెగలాల్సిందే
కడుపు రగిలినపుడు
మాట పిడుగై కురవాల్సిందే

మిత్రమా,
నీ వౌనం స్వయంధారిత శృంఖలం
భయం నిర్మిత కారాగారం
కాబట్టి వౌనాన్ని కీర్తించకు
పలాయనతను పరివర్తించకు
గుర్తుంచుకో -
నీ గళం మండే అగ్నిబిలం
శత శతఘు్నల స్థావరం
మానవ పురోగతికి మూలాధారం.

-- డా.డి.వి.జి.శంకరరావు, 9440836931