Others

విషోదయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉషోదయాలన్నీ
విషోదయాలైన నది ఒడ్డున నిలబడి

తలో, చేతులో తెగిపోయన దినాల్ని
ప్రతి ఉదయాన
పతాక శీర్షికగా చదువుకోవడం కన్నా
అతి పెద్ద విషాదం ఏదనుకోవాలి...?!

ఇన్ని బడులున్నాయ
ఎన్నో గొప్పలు చెప్పుకునే గుడులున్నాయ
ఇన్ని వేల వివక్షల నదులెందుకు
ఇంకా ఎక్కడ పారుతున్నాయో తెలియడం లేదు
ఇంత జ్ఞానముంది
ఇన్ని ఘోరాలెందుకు
మనిషికి ఎన్ని గోరీలు కడుతున్నాయో అర్థం కాలేదు!

ఎలా చదువుకోవాలి
వాక్యాలన్నీ దుర్మార్గాల నెత్తుటి వాసన
పదాలన్నీ సలపరింపుల సంవేదన

ఏ బడీ లేని అడివి నిండా ఎన్ని నీతి పాఠాలో
మొలిచే ప్రతి పొద్దూ
రెక్కలు విప్పుకున్న ఆకాశం అక్కడ!

బడుల్లో నాటే ప్రేమ విత్తనాలు
ప్రేమకు ద్వేషమనే
అర్థాన్ని పులుముకున్నాయేమో
వర్తమానమంతా విద్వేషాల విషగాలులై వీస్తుంది!

అడవుల్లో న్యాయ పీఠాలు
పర్వతాల్లో ప్రేమ పాఠాలు
అరేబియా ఎడారిలో అనురాగ దీపాలు
అట్లాంటిక్ లోతుల్లో జీవన గీతాలు
పక్షులై, జంతువులై, చేపపిల్లలై
అంతో ఇంతో
స్వేచ్ఛనూ సంతోషాన్ని
కనురెప్పల్లో నిద్ర చేసుకుని శ్వాసిస్తున్నప్పుడు
మనిషి మాత్రం పతన గీతాల్ని
పతాక స్థాయలో పాడుకోవడమే పెద్ద విషాదం!

ఇప్పటికైనా
ఒక పిట్టలానో
ఒక వంటెలానో
మనం మనమయ్యే మాట రాసుకుందామా!
మనం బతికుండే రేపటిని ఒక బొమ్మ గీసుకుందామా!

-- పల్లిపట్టు నాగరాజు, 9989400881